ఇంట్లో వాడే ఈ వస్తువులకు కూడా గడువు తేదీ ఉంటుందా..

by Sumithra |   ( Updated:2024-05-25 12:19:18.0  )
ఇంట్లో వాడే ఈ వస్తువులకు కూడా గడువు తేదీ ఉంటుందా..
X

దిశ, ఫీచర్స్ : మనం వాడే ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మందులు, టానిక్ లు, ఫుడ్ ఐటమ్స్, ఇలా అన్నింటికి ఓ గడువు తేదీ ఉంటుంది. చాలామంది కొన్ని వస్తువులను వాడే ముందు, కొనుగోలు చేసేముందు ఎక్స్‌పైరీ తేదీ చూస్తారు. అలాగే మార్కెట్‌లో కొన్ని ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కూడా గడువు తేదీని తనిఖీ చేస్తారు. కాని కొంతమంది వాటిని పెద్దగా పట్టించుకోరు. మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు చాలా ఉండే ఉంటాయి. అయినా వాటి గడువు తేదీని పట్టించుకోరు ప్రజలు. వాటిని ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. వీటి వల్ల బ్యాక్టీరియా పెరగడం ప్రారంభిస్తుంది. ఇది అనారోగ్యానికి గురి చేస్తుందంటున్నారు నిపుణులు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దిండును ఎంత కాలానికి మారుస్తారు ?

ఇంట్లో దిండు మీరు రోజూ ఉపయోగించేది. కానీ చాలా మంది వ్యక్తులు కుషన్ కవర్‌ను మాత్రమే శుభ్రం చేస్తారు. కానీ దిండును ఎక్కువ కాలం వాడటం వల్ల దుమ్ము, ధూళి అందులో చేరి బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. దీంతో జుట్టు రాలడం, ముఖం పై మొటిమలు వంటి సమస్యలు మొదలవుతాయి. అంతే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు. అందుకే దిండును ఎప్పటికప్పుడు సూర్యరశ్మికి తగిలేలా చేసి ఏడాదిన్నర తర్వాత మార్చాలి.

మేకప్ బ్రష్..

చాలా మంది మహిళలు తమ ముఖానికి ఒకే రకమైన మేకప్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. బ్రష్‌ని ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయకపోవడం లేదా ఇతరులతో పంచుకోవడం అతిపెద్ద తప్పు. దీని వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లతో పాటు కళ్లు, ఆరోగ్యం కూడా దెబ్బతింటాయి.

టూత్ బ్రష్ ఎన్ని రోజుల తర్వాత మార్చాలి ?

చాలామంది టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతుంటారు. ఆ టూత్ బ్రష్‌ పూర్తిగా పాడయ్యేంత వరకు ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ ప్రతి మూడు నెలలకోసారి మీ టూత్ బ్రష్ మార్చాలి.

డిష్ వాషింగ్ స్పాంజ్..

కొంత మంది డిష్ వాషింగ్ స్పాంజ్ లను ఎక్కువ కాలం వినియోగిస్తూ ఉంటారు. అవి పూర్తిగా చిరిగిపోయేంత వరకు వాటిని వినియోగిస్తారు. ఇలా చేయడం ద్వారా స్క్రబ్బర్‌లో చాలా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో ఈ బ్యాక్టీరియా పాత్రల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రెండు నెలలకోసారి మార్చాలి.

మీరు దువ్వెనను ఎన్ని రోజులు ఉపయోగిస్తున్నారు ?

మీరు మీ దువ్వెనను ఎంత తరచుగా మారుస్తారు ? ఈ ప్రశ్నకు ఎవరైనా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేరు. ఒకే దువ్వెనను ఎక్కువ కాలం ఉపయోగించడం లేదా శుభ్రత లేకపోవడం వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్, జుట్టు రాలిపోయే అవకాశాలు పెరుగుతాయి.

Advertisement

Next Story

Most Viewed