- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు సుడులు ఉన్నవారు నిజంగానే రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి తలలో రెండు లేక మూడు సుడులు ఉంటాయి. ఇలా సుడులు ఉండటం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది. రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారాని అందరూ అంటుంటారు. దీంతో పెద్దలు సైతం ఒక్కోసారి ఆందోళనకు గురవుతారు. తమ పిల్లలకు రెండు పెళ్లిళ్లు అవుతాయేమోనని కంగారు పడతారు. ఇది నిజమేనా లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా..? అనేది తెలుసుకుందాం.
నిజానికి ప్రపంచ జనాభాలో 5 శాతం మందికి రెండు సుడులు ఉన్నట్లు NHGRI అధ్యయనం వెల్లడించింది. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే డబుల్ ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యూన్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారి తల్లిదండ్రులకు ఉన్నదాని బట్టి పిల్లలకు కూడా ఈ సుడులు అనేవి ఏర్పడతాయట. కాబట్టి తలలో రెండు సుడులు అనేవి పురుషులు, మహిళలు వారి కుటుంబ సభ్యుల వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.
నిజానికి రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏది లేదు. ఇది శరీరం లక్షణం మాత్రమే. కానీ, కొన్ని సందర్భాల్లో తలలో రెండు సుడులు ఉన్న కొందరు రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇది రెండు సుడులు ఉన్న కారణంగానే జరిగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే దీనిపై ఖచ్చితమైన ఆధారం లేదు.
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పుకుంటే.. రెండు సుడులు ఉన్నవారు మంచివారు. సూటిగా మాట్లాడతారని, ఓపికగా ఉంటారని, కష్టాలలో స్పందిస్తారని చెబుతారు. అంతే కాకుండా ఏ నిర్ణయం తీసుకోవాలన్న వందసార్లు ఆలోచిస్తారట. తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారట. అయితే తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయనే మాట నిజం కాదని అధ్యయనం కొట్టేపడేసింది.
Read More... స్క్రీన్ టైమ్ సైడ్ ఎఫెక్ట్స్.. హార్మోన్లపై ప్రభావంతో అనారోగ్యాలు
Hair fall : వీటిని తీసుకుంటే జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు?