- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీటిని అసలు మీ ముఖంపై అప్లై చేయోద్దు.. ఎందుకంటే..?
దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని ఆశ పడుతుంటారు. దీని కోసం ఎన్నో క్రీములు, ఎన్నో పేస్ ప్యాక్ లు వేస్తుంటారు. ముఖం తెల్లగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు ముఖాలు అందంగా మార్చడానికి చాలా తప్పులు చేస్తారు. ఈ కారణంగా, ముఖం మీద అలర్జీలు వస్తుంటాయి. కొన్నింటిని, ముఖానికి వాడడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
నిమ్మరసం
కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు నిమ్మరసాన్ని ఫేస్ కి రుద్దుతుంటారు. అయితే, నిమ్మరసం సహజంగా ఆమ్లంగా ఉంటుంది. నిమ్మరసాన్ని నేరుగా అప్లై చేయడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది, చికాకు కలిగిస్తుంది. దీని వలన ముఖం ఎరుపుగా మారుతుంది.
వంట సోడా
మీ ముఖానికి బేకింగ్ సోడాను అసలు వాడొద్దు. ఇది చర్మానికి అసలు మంచిది కాదు. దీని వలన దురద సంభవించవచ్చు. కొంతమంది ముఖానికి టూత్‌పేస్ట్‌ను కూడా పెడుతుంటారు. అయితే, ఇది చర్మంపై అప్లై చేసినప్పుడు దద్దుర్లు, ముడతలకు దారితీస్తుంది.
వేడి నీరు
మరిగే నీటితో ముఖాన్ని శుభ్రపరచకండి. వేడి నీరు మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఈ నివారణలన్నింటినీ ఉపయోగించడం మానుకోండి. ముఖానికి గాయం అయ్యే ప్రమాదం ఉంది. మీకు అలెర్జీలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.