- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారా..? అయితే ఇది గుర్తుంచుకోండి?
దిశ, ఫీచర్స్: అసలే సమ్మర్ సీజన్. ఎండలో ప్రయాణం చేయగానే చల్లగా ఏదైనా తినాలనిపించే వారిలో చాలామంది ఐస్ క్రీమ్‌ను ఇష్టపడుతుంటారు. బేకరీల్లో రకరకాల డిజైనింగ్ బాక్సులు కవర్లలో ఘనీభవించిన చల్లటి పదార్థాలన్నీ మనం ఐస్ క్రీములుగా భావిస్తుంటాం. కానీ ఇది నిజం కాదని డైటీషియన్లు అంటున్నారు. నిజంగా మిల్క్‌తో తయారు చేసిన ఐస్ క్రీములు ఆరోగ్యానికి మంచిది కావచ్చు. కానీ ఐస్ క్రీములుగా పేర్కొనే చల్లటి ఘనపదార్థాలన్నింటిలో మిల్క్ ఉంటుదన్న గ్యారెంటీ లేదు. అలాగే హెల్తీ పదార్థాలు కలుపుతారని గుడ్డిగా నమ్మి తినేస్తే అలర్జీలు, అనారోగ్యాలకు దారితీయవచ్చు. అందుకే ఐస్ క్రీమ్‌లు కొనే ముందు అవి ఐస్ క్రీములా? ఫ్రోజెన్ డెజర్టులా అనేది.. వాటి ప్యాకింగ్ కవర్లు, బాక్సులపై ఉన్న లేబుల్‌ను చెక్ చేయడం ద్వారా తెలుస్తుంది.
వాటిలో కలిపిన పదార్థాలను బట్టి ఏది మంచిదో ఏది చెడుదో డిసైడ్ అవ్వొచ్చు. ఒకవేళ పామాయిల్ ఒక శాతం ఉండి, అంతకుమించి ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే గనుక అవి తినకూడదు. లేదంటే హై కొలెస్ట్రాల్ లెవల్స్‌కు దారి తీస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడంవల్ల ధమనులు(arteries) మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కొన్ని రకాల ఐస్ క్రీములను మిల్క్ ప్రొడక్ట్స్‌గా చెప్తుంటారు. కానీ ఫ్రోజెన్ డెజర్ట్‌లలో నిజమైన పాలు ఉండవు. పాలపొడి యూజ్ చేస్తారు. దీనివల్ల ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులకు కారణం అవుతుంది.