స్ట్రాబెర్రీలతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చని తెలుసా?

by Prasanna |
స్ట్రాబెర్రీలతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చని తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతిలో లభించే అన్ని రకాల పండ్లను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి స్ట్రాబెర్రీలు. ఈ పండును చాలా మంది ఇష్టపడతారు. ఇది చూడటానికి ఎర్రగా నిగ నిగ లాడుతుంటుంది. దీని వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం..

ఎముకలను బలపరుస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా, బోన్స్ ని గట్టిగా చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. అధిక బరువుతో బాధపడే వారు స్ట్రాబెర్రీలు సూపర్ ఫుడ్. ఎందుకంటే వాటిని తింటే ఎక్కువ రోజులు ఆకలి వేయదు. ఫలితంగా బరువు నియంత్రణ ఉంటుంది.

రోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల విటమిన్ సి, ఇతర పోషకాలు ఉన్నందున కంటి సమస్యలను నివారించవచ్చు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే దృష్టి కూడా పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ , పొటాషియం వంటి పోషకాలతో రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Advertisement

Next Story

Most Viewed