- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మోకింగ్ చేయడం కూడా కంటికి ముప్పు అని తెలుసా?
దిశ, ఫీచర్స్ : పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం అని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అంతే కాకుండా, సినిమా థియేటర్లలో, సిగరేట్, బీడీ ప్యాకెట్స్‌పై స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని రాస్తుంటారు. అయినా ఎవరూ వాటిని లెక్క చేయకుండా స్మోకింగ్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈ మధ్య యూత్ ఎక్కువగా సిగరెట్ తాగడానికి ఇంట్రెస్ట్ చూసిస్తున్నారు. తర్వాత దీని వలన వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఈ స్మోకింగ్ వారినే కాకుండా, తమ కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ పొగ తాగడం అనేది శ్వాసకోశ సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల పైనే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ దీనిపై ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
స్మోకింగ్, కంటి ఆరోగ్యంపైనా కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపారు పరిశోధకులు. స్మోకింగ్, దృష్టి లోపానికి మధ్య ఉన్న సంబంధం ఆందోళన కలిగించే విషయమైన వారు తెలుపుతున్నారు. ఇది పొగ తాగే వారికే కాకుండా, పొగ పీల్చే వారిపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందంట.
స్మోకింగ్ చేసే వారిలో కంటి శుక్లాలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందంట. దీని కారణంగా కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం, అస్పష్టమైన దృష్టి , ఒక వస్తువు రెండుగా కన్పించడం, కంటిలో తెల్లగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.అంతే కాకుండా రాత్రిపూట ఏదైనా వస్తువులు సరిగా కనిపించక పోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయంట. మరి ముఖ్యంగా దీని ప్రభావం, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ ఎక్కువ ఉంటుందంటున్నారు నిపుణులు. వీరు స్మోక్‌కు గురైతే, డ్రై ఐ సిండ్రోమ్, ఆప్టిక్ నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, అందువలన స్మోకింగ్ చేయడం మానేయడమే కాకుండా, స్మోక్ చేసే వారికి చాలా దూరం ఉండాలంటున్నారు వైద్యులు.