Diamonds : డైమండ్స్ పొందడం ఇక చాలా ఈజీ.. కొత్త పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు

by Javid Pasha |
Diamonds : డైమండ్స్ పొందడం ఇక చాలా ఈజీ.. కొత్త పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా డైమండ్స్ భూమిలో లభిస్తుంటాయి. ఇవి ఏర్పడటానికి లక్షలాది సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అలా ముడి పదార్థాల రూపంలో సేకరించిన వాటిని నిజమైన వజ్రాలుగా తయారు చేయడానికి ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. కానీ రీసెంట్‌గా దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 150 నిమిషాల్లో డైమండ్స్‌ను తయారు చేయగల న్యూ మెథడ్‌ను కనుగొన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణతో వజ్రాల తయారీని సులభతరం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

న్యూ మెథడ్ ఎలా పనిచేస్తుంది?

దక్షిణ కొరియా శాస్త్రవేత్తల ప్రకారం.. గ్యాలియం, ఐరన్, నికెల్, సిలికాన్ అనే మెటల్స్‌తో తయారు చేసిన లిక్విడ్‌ను .. మిథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి ఒక వాక్యూమ్ ఛాంబర్‌లో స్టోర్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని హీట్ చేయడం ద్వారా కార్బన్ ఆటమ్స్ లిక్విడ్ మెటల్‌తో కలిసి 15 నిమిషాల్లో చిన్న చిన్న డైమండ్ స్ఫటికాలు ఏర్పడతాయి. తర్వాత రెండు గంటల్లో డైమండ్ మెటీరియల్ థిన్ లేయర్ ఏర్పడుతుంది. పైగా ఈ క్రిస్టల్స్ లిక్విడ్ మిశ్రమంలో కరిగిపోతాయి కాబట్టి, ఈ ప్రాసెస్‌లో వజ్రాలు ఈజీగా, వేగంగా పెరగడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

సవాళ్లు కూడా..

కాగా ఈజీగా తక్కువ సమయంలో డైమండ్స్ తయారు చేయగల ప్రాసెస్‌లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి డైమండ్ లేయర్ చాలా సన్నగా మాత్రమే తయారవుతోంది. కార్బన్ ఆటమ్స్ పూర్తిగా అభివృద్ధి చేయడానికి మెరుగైన మార్గాలను కనుగొనడం ద్వారా పరిశోధకులు దానిని కొంచెం మందంగా చేయగలమని నమ్ముతున్నారు. ఈ న్యూ మెథడ్ డైమండ్స్ తయారీ విధానాన్ని పూర్తిగా మార్చగలదు. వాటిని మరింత అందుబాటులోకి తెచ్చి, ఉత్పత్తి చేయడానికి సులభతరం చేస్తుంది. ఇది వివిధ రంగాలలో కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ఏది ఏమైనా కొత్త ఆవిష్కరణ డైమండ్ ఇండస్ట్రీలో మార్పులకు ప్రధాన కారణం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed