పిల్లల్లో డయాబెటిస్

by srinivas |   ( Updated:2023-04-04 08:48:01.0  )
పిల్లల్లో డయాబెటిస్
X

దిశ, ఫీచర్స్: పిల్లలు పదే పదే యూరిన్‌కు వెళ్లడం, అధిక దాహంతో ఉంటున్నట్లు ఫీల్ అవడం, త్వరగా అలసిపోవడం, వెయిట్ లాస్ అవుతున్నట్లు కనిపిస్తే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఒక సాధారణ బ్లడ్ షుగర్ టెస్ట్ డెసిలీటర్‌కు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ స్థాయిని స్పష్టంగా చూపించడం మధుమేహాన్ని సూచిస్తుంది. ఇలాంటి సమయంలో పిల్లల ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్‌లో బీన్స్, క్యారెట్స్, చీజ్‌, వెజిటెబుల్స్‌తో కూడిన ఆహారాన్ని ఇవ్వాలి. ఇక లంచ్ టైమ్‌లో సలాడ్, రైతా, వెజిటెబుల్ కర్రీస్, పప్పులు ఇవ్వడం మంచిది. ఇక రాత్రి భోజనంలో ఓక్రా, బచ్చలికూర లాంటి ఆకుకూరలు.. నాన్ స్టార్చీ, ఫైబర్ రిచ్ వెజిటెబుల్స్‌ను చేర్చాలి. ఇవి ఆహారం యొక్క గ్లైసెమిక్ సూచికను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా, ఎక్కువగా పెంచుతాయి.

అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటెమ్స్

జ్యూస్‌లు, కార్బోనేటేడ్ డ్రింక్స్, స్వీట్ లస్సీతో సహా తీపి పానీయాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల కేవలం కేలరీలు మాత్రమే వస్తాయి కానీ ఎటువంటి పోషకాహారం లభించదు. కుకీలు, గింజలు అలాగే నూనెలు వంటి వాటిని డీప్ ఫ్రై చేసే సమయంలో పదే పదే ఉపయోగించేవి, ట్రాన్స్‌ఫ్యాట్‌ల మొత్తాన్ని పెంచుతాయి. భవిష్యత్తులో కార్డియోవాస్క్యులార్ వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

Read more:

బ్లూబేబీ సిండ్రోమ్

Advertisement

Next Story

Most Viewed