- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊవ్విళ్లూరించే క్యారెట్, గుమ్మడికాయ కేక్ తయారీ విధానం!
దిశ, వెబ్‌డెస్క్: కేక్ అంటే చిన్నపిల్లలకే కాదు పెద్దలు సైతం ఇష్టంగా తింటారు. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరూ.. పుట్టిన రోజులకు, ప్రమోషన్స్, జాబ్స్ రావడం, పెళ్లిళ్లు, యానివర్సీలకు ఇలా ప్రత్యేకమైన సందర్భాల్లో కేక్ కట్ చేస్తున్నారు. కొంతమంది స్పెషల్ డే లేకున్నా బయట బేకరీలో తయారీ చేసిన కేకులను డబ్బులతో కొనుక్కుని మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటాయి మరీ కేక్స్. కానీ బయట దొరికే కేక్‌లు ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు. ఎందుకంటే చాలా రోజులు స్టోరేజ్ ఉండొచ్చు. అయితే ఈ కేక్స్‌ను ఇంట్లోనే తయారుచేసి తినడం చిన్నపిల్లలకు కూడా మంచిదని తాజాగా ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కాగా చలికాలంలో అందరూ ఇష్టంగా తినే క్యారెట్, గుమ్మడికాయ కేక్‌ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
క్యారెట్, గుమ్మడికాయ కేక్ తయారీ విధానం :
కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు -3, మైదా పిండి- 2 కప్పులు, గుడ్లు - 2, తగినంత చక్కెర, ఆలివ్ ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్, సాల్ట్, బేకింగ్ పౌడర్- 1 టీస్పూన్, గుమ్మడి కాయ పేస్ట్, దాల్చిన చెక్క తురుము తీసుకోవాలి.
క్యారెట్-గుమ్మడికాయ కేక్‌ను రెడీ చేయడానికి ముందుగా మైక్రోవేవ్‌ను కొంచెం ప్రీ హీట్ చేయండి. అనంతరం క్యారెట్, పంచదార, నూనె, గుడ్డు, వెనిల్లా ఎసెన్స్ ను ఒక బౌల్‌లో వేసి బాగా కలపండి. 15 నిమిషాల సమయం తర్వాత గుమ్మడి కాయ పేస్ట్, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్, ఉప్పును ఆ మిశ్రమంలో వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని బేకింగ్ ట్రేలో వేసి 20 నుంచి 30 నిమిషాలు బేక్ చేయండి. అంతే చాలా సింపుల్‌గా, చాలా సులువుగా క్యారెట్ కేక్ తయారైపోయింది. ఎంతో టెస్టీగా ఉండే ఈ కేక్ చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా కూడా బాగా నచ్చుతుంది.