యూరిన్ కలర్‌ను బట్టి రోగాన్ని గుర్తించవచ్చు! అదెలాగంటే..

by Mahesh |   ( Updated:2023-03-23 08:23:18.0  )
యూరిన్ కలర్‌ను బట్టి రోగాన్ని గుర్తించవచ్చు! అదెలాగంటే..
X

దిశ, ఫీచర్స్: హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్లు సూచించే టెస్టుల్లో యూరిన్ టెస్టు కూడా ఒకటి. దీని ద్వారా కొన్ని రకాల రోగాలు బయటపడతాయి. శరీరంలోని వ్యర్థాలు, అదనపు నీరు యూరిన్ రూపంలో మూత్ర వ్యవస్థ ద్వారా బయటకు పోతుంది. మరో విషయం ఏంటంటే యూరిన్ కలర్‌ను బట్టి కూడా రోగాలను తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

ఒకవేళ తరచుగా యూరిన్ రెడ్ కలర్‌లో బయటకు విసర్జిస్తుంటే గనుక క్యాన్సర్ అయి ఉండవచ్చని అనుమానించాల్సిందే. అయితే తరచూ తినే ఆహారాలు, వాడే మందులను బట్టి కూడా యూరిన్ కలర్ మారుతూ ఉంటుంది. అందుకే ఒక్కసారి కలర్ మారగానే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిసారీ కలర్ మారుతూ వస్తే అనుమానించాల్సిందే. ఏవైనా అనుమానాలుంటే క్లారిఫికేషన్ కోసం డాక్టర్లను సంప్రదించాలి.

రెడ్ యూరిన్

కొన్ని కొన్ని సార్లు మూత్రం బయటకు వెళ్లే మార్గంలో ఇంటర్నల్ బ్లీడింగ్ (రక్తస్రావం) జరుగుతుంది. ఈ కారణంగా యూరిన్ రెడ్ కలర్‌లో బయటకు రావచ్చు. మూత్రాశయంలో రాళ్లు, క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా యూరిన్ రెడ్ కలర్‌లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. గ్లోమెరులో నెఫ్రిటిస్ అనే ప్రైమరీ గ్లోమెరులర్ రుగ్మతల కారణంగా కూడా యూరిన్ రెడ్ కలర్‌లో వస్తుంది.

లైట్ ఎల్లో

బాడీ ప్రొడ్యూస్ చేసే యురోబిలిన్ వర్ణద్రవ్యం కారణంగా యూరిన్ లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే ఇది ఎంత నీరు తాగుతున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా యూరిన్ కలర్ లేత పసుపు రంగు నుంచి ముదురు పసుపు రంగు వరకు ఉండే అవకాశం ఉంటుంది. శరీరం నిర్జలీకరణ సమయంలో మూత్రపిండాలు యూరిన్ నుంచి నీటిని ఎక్కువ తీసుకుంటాయి. దీనికారణంగా ఎక్సర్‌సైజ్, లేదా శారీరక శ్రమ చేశాక నీటి సమతుల్యతను అదుపులో ఉంచడానికి నీరు తిరిగి శరీరానికి అందుతుంది.

కలర్ లెస్ యూరిన్

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని తాగినప్పుడు యూరిన్‌కు ఎలాంటి రంగూ ఉండదు. అంటే మూత్రపిండాలు అదనపు నీటిని రంగులేని యూరిన్ రూపంలో బయటకు పంపుతాయి. తగినంత హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు కూడా యూరిన్ రంగును కలిగి ఉండదు.

డార్క్ ఎల్లో

పచ్చ కామెర్లు ఉంటే గనుక యూరిన్ ముదురు పసుపు రంగులో ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు, సల్ఫా సలాజైన్ లేదా ఫెనాజో పైరిడిన్ వంటి మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు కూడా మూత్రం డార్క్ ఎల్లో లేదా నారింజ రంగులో కనిపిస్తుంది.

ముదురు గోధుమ

యూరిన్ ముదురు గోధుమ రంగులో వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది మూత్రాశయ లేదా మూత్రపిండాల క్యాన్సర్ లక్షణాల్లో ప్రమైరీ ఇండికేషన్. మూత్రపిండాల్లో రాళ్లు, యూరినల్ ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధుల కారణంగా కూడా అప్పుడప్పుడు యూరిన్ ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. నిర్జలీకరణ, లాంగటైమ్ యూరినల్ కాథెటర్ యూజ్ చేయాల్సి రావడం కూడా ముదురు రంగు యూరిన్ ఏర్పడేందుకు కారణం అవుతుంది.

Read more:

చల్ల చెమటలు పడుతున్నయా.. అయితే వెంటనే మీరు వైద్యులను సంప్రదించాల్సిందే..!

Advertisement

Next Story

Most Viewed