Dark Elbows : మోచేతులపై నలుపును పోగొట్టే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే సరి!

by Javid Pasha |   ( Updated:2024-10-21 15:00:15.0  )
Dark Elbows : మోచేతులపై నలుపును పోగొట్టే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే సరి!
X

దిశ, ఫీచర్స్ : శరీరం రంగు ఎలా ఉన్నా మోకాళ్లు, మెడ, మోచేతులు వంటి భాగాల్లో నల్లగా ఉండటాన్ని కొందరు ఇబ్బందిగా భావిస్తారు. దానిని తగ్గించడానికి రకరకాల క్రీములు, మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే వీటితోపోలిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటిలోనే పాటించదగ్గ కొన్ని చిట్కాలతో కూడా నలుపు సమస్యను దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

* పసుపు : ఒక టీ స్పూన్ పసుపు పొడిని తీసుకోండి. అందులో తేనె లేదా పాలు కలిపి పేస్ట్ చేయండి. తర్వాత దానిని మోచేయిపై నలుపు గల భాగంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగితే చాలు. వీక్లీ 3 టైమ్స్ ఇలా చేసినా నలుపు తగ్గిపోతుంది.

* బంగాళ దుంప : బంగాళ దుంప చర్మ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని కట్ చేసి దాని రాసాన్ని తీసి, మోచేతులపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో నలుపుదనం పోతుంది.

* బేకింగ్ సోడా : మోచేతులు, మోకాళ్లపై నలుపును పోగొట్టడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఒక చెంచా సోడాలో 2 చెంచాల పాలు లేదా పెరుగు మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను నల్లటి చర్మం భాగంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే క్రమంగా నలుపుదనం పోతుంది.

* నిమ్మకాయ : నిమ్మకాయలో సగం ముక్కను కోసి డైలీ రెండుసార్లు నలుపు ఉన్న మోచేతి భాగంపై రుద్దాలి. 10 నిమిషాల తర్వాత కడగాలి. క్రమంగా నలుపు మాయం అవుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. ప్రయత్నించే ముందు చర్మవైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story