- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేంజరస్ డ్రగ్స్ : యూఎస్ వీధుల్లో జోరుగా అమ్మకాలు
దిశ, ఫీచర్స్ : యునైటెడ్ స్టేట్స్‌లో, ప్రధానంగా అమెరికాలో ఓపియాయిడ్ సంక్షోభానికి కేంద్రమైన ఫిలడెల్ఫియా వీధుల్లో విక్రయిస్తున్న(జిలాజైన్)కొత్త వీధి మందులతో అక్కడి వైద్యులు కలవరపడుతున్నారు. ఎందుకంటే ఇవి వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చర్మంపై పుండ్లు, చర్మ క్షీణత వంటి వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతున్నాయి. చికిత్స తీసుకోకుంటే భయంకరమైన గాయాలుగా మారి శరీరంలో మృత కణాలు వ్యాపించి, క్రమంగా చర్మం క్షీణిస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వినియోగదారులను అది మత్తులోకి జారుకునేలా చేయడంవల్ల దానిని తరచూ వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. క్రమంగా ఇతర మాదక ద్రవ్యాలకు కూడా బానిసలవుతున్నారు.
కొన్నిసార్లు "ట్రాంక్" అని పిలువబడే జిలాజైన్ మెడికేషన్ విపత్తు ప్రభావాలు యూఎస్‌లోని నగరాల్లో ఒక విధంగా వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ "జోంబీ డ్రగ్" వాస్తవానికి వినియోగదారుడి చర్మం క్రమంగా క్షీణించడానికి దోహదం చేస్తోంది. అమెరికా యువతను నాశనం చేసిన ఓపియేట్ అయిన ఫెంటానిల్ అండ్ జిలాజైన్ కలిపి ట్రాంక్‌ను రూపొందించారు. వీధిలో ఒక్కో బ్యాగ్‌కి కొన్ని బక్స్‌లకు మాత్రమే కొనుగోలు చేసేలా దీనిని విక్రయిస్తున్నారు. ఫెంటానిల్ కలుపడంవల్ల దాని ప్రభావం(హిట్) అధికంగా ఉంటుందని డీలర్లకు తెలిసినా అలాగే చేస్తున్నారు.
ఈ కొత్త రకమైన డ్రగ్ (జిలాజైన్ ) వినియోగదారులను సెమీ కాన్షియస్ స్థితిలోకి తీసుకెళ్లడంతోపాటు చర్మం క్షీణించడానికి కారణం అవుతోంది. ఎస్చార్, అలాగే శరీరంపై బయటి గాయాల ద్వారా ఏర్పడిన మృత కణజాలంతో కూడిన పొలుసుల పొర అనేది ట్రీట్ మెంట్ చేయకుండా వదిలేస్తే ఆ గాయం ఉన్న ప్రదేశంలోని విచ్ఛేదనం అవసరం కావచ్చు అని వైద్యులు చెప్తున్నారు.
జిలాజైన్ అనే ఈ డ్రగ్ ఎక్కువగా గుర్రాలు, ఆవులపై చికిత్సలకు కూడా ఉపయోగిస్తారు. అధికంగా లేదా తరచుగా యూజ్ చేస్తే ఇది మత్తుమందుగా పనిచేస్తుంది. దీనివల్ల అలసట, శ్వాసకోశ సమస్యలు, అప్పటికే ఉన్న గాయాలు తీవ్రమవుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, చర్మంపై ఏర్పడిన గాయాలు, పుండ్లలోని కణజాలాలు శరీరం అంతా వ్యాపించి ఎస్చార్ అని పిలువబడే డెడ్ స్కిన్‌గా అభివృద్ధి చెందుతాయి. తర్వాత చికిత్స పనిచేయదు, ఆ డెడ్ స్కిన్ ప్రాంతాన్ని విచ్ఛేదనం చేయాల్సి ఉంటుంది.
"ట్రాంక్ అనేది ప్రాథమికంగా ప్రజల శరీరాలను జాంబిఫై చేయడం. 9 నెలల కిందట నా శరీరంపై ఎటువంటి గాయాలూ లేవు. కానీ ప్రస్తుతం నా కాళ్లు, చేతులపై పొక్కులు, రంద్రాలు ఏర్పడ్డాయి'' అని కొందరు జిలాజైన్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మోతాదులతో (xylazine)వినియోగిస్తే ఇది అపస్మారక స్థితికి తీసుకువెళుతుంది. ఇది వ్యక్తిలో స్లో పాయిజన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. డ్రగ్ ను సేకరించినప్పుడు మంచిగానే కనిపించే వినియోగదారుడు తర్వాత అతను ఎక్కడికైనా బయటకు వెళ్లాక క్రమంగా మత్తులోకి జారుకుంటాడు. ఫలితంగా ఈ డ్రగ్స్‌ని ఉపయోగించే వారు బయటకు వెళ్లినప్పుడు లైంగిక వేధింపులకు గురికావడం, కారు, ఇతర వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆస్పత్రులు కూడా చాలా చాలా అరుదుగా సాధారణ టాక్సికాలజీ పరీక్షతో దీనిని పరీక్షిస్తాయి. ఎందుకంటే "ట్రాంక్" అనేది వ్యక్తులకు సంబంధించిన పదార్థంగా లేదు. జిలాజైన్‌తో ఔషధాలను ఉపయోగించినప్పుడు సైకోయాక్టివ్ ప్రభావాలు విస్తరిస్తాయి. మాదకద్రవ్యాల వినియోగం పెరిగేందుకు ఇది కారణం అవుతుంది. కాబట్టి దాని బారి నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి:
బ్రీత్ హోల్డింగ్ టెక్నిక్.. కీలకపాత్ర పోషిస్తున్న కెమోరెసెప్టర్లు..