చిన్న పిల్లలకు ఏ నెల నుంచి ఆవు పాలు తాగించొచ్చు?

by Sujitha Rachapalli |
చిన్న పిల్లలకు ఏ నెల నుంచి ఆవు పాలు తాగించొచ్చు?
X

దిశ, ఫీచర్స్: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే దానిపై తరుచుగా సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం ఫార్ములా ఫీడింగ్ తినిపించిన పిల్లలు ఆరు నెలల నుంచి ఆవు పాలు తాగొచ్చు. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం 12 నెలల వరకు వెయిట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పేరెంట్స్, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ గందరగోళంలో పడిపోయారు. ఇంతకు ఏ నెల నుంచి ఆవుపాలు తాగించాలి? ఎందుకు? అనే దానిపై గతంలో ఇచ్చిన వివరణ తెలుసుకుందాం.

గతేడాది WHO రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు గ్లోబల్ ఫీడింగ్ మార్గదర్శకాన్ని అప్‌డేట్ చేసింది. ఫార్ములా ఫీడ్ పూర్తిగా లేదా కొద్దిగా తినిపిస్తున్న పిల్లలు ఆరు నెలల నుంచి పూర్తిగా ఆవుపాలు తీసుకోవచ్చని సిఫారసు చేసింది. శిశువుల పెరుగుదల, ఆరోగ్యాన్ని పాశ్చరైజ్డ్ లేదా కాగబెట్టిన పాలతో పోల్చి చూశాక ఈ నిర్ణయానికి వచ్చింది. ఫార్ములా ఫీడింగ్.. ఆవు పాల కంటే మెరుగైన డెవలప్మెంట్ ఇస్తుందనే ఆధారాలు లేకపోవడంతో ఇలాంటి సిఫారసు చేసింది. కానీ తాజాగా జంతువుల పాలు తాగించిన శిశువులలో ఐరన్ లోపం అనీమియా పెరుగుదలను సమీక్ష కనుగొంది. అయితే ఆరు నెలల నుంచి ప్రతిరోజూ పిల్లలకు ఐరన్ అధికంగా ఉండే ఘన ఆహారం ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చని తెలిపింది. కానీ ఫ్లేవర్డ్ లేదా తియ్యటి పాలు ఇవ్వకూడదని సూచించింది.

నిజానికి ఐరన్ ప్రతి ఒక్కరికీ అవసరమైన పోషకం. శిశువుల పెరుగుదల, మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. శిశువుల శరీరాలు సాధారణంగా గర్భంలో ఉన్న చివరి కొన్ని వారాలలో తగినంత ఐరన్‌ను స్టోర్ చేసుకుంటాయి. ఇది కనీసం ఆరు నెలల వయస్సు వరకు సరిపోతుంది. కానీ శిశువులు ముందుగానే జన్మించినట్లయితే లేదా గర్భధారణ సమయంలో వారి తల్లులు రక్తహీనతతో ఉంటే ఐరన్ తగ్గిపోవచ్చు.అయితే ఆవు పాలు ఐరన్‌కు మూలం కాదు. బేబీ ఫార్ములా ఆవు పాలతో తయారు చేయబడుతుంది. ఐరన్ యాడ్ చేయబడుతుంది. తల్లిపాలలో కూడా ఐరన్ తక్కువగా ఉంటుంది. కానీ శిశువుల శరీరాలు ఎక్కువగా తీసుకుంటాయి. అందుకే ఆరు నెలల తర్వాత ఐరన్ కోసం పిల్లలు పాలపై ఆధారపడకూడదు. కాబట్టి WHO ఐరన్ అధికంగా ఉండే ఘనమైన ఆహారాన్ని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మాంసం, గుడ్లు, కూరగాయలు, బీన్స్, పచ్చి ఆకు కూరలతో సహా, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఈ లిస్టులో ఉన్నాయి. కానీ ఉప్పు, చక్కెర మాత్రం వినియోగించకూడదు.

Advertisement

Next Story

Most Viewed