- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pneumonia : ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే న్యుమోనియా కావచ్చు!
దిశ, ఫీచర్స్: తరచూ కఫంతో కూడిన దగ్గు, చలిజ్వరం, ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. నీరసం, తీవ్రమైన బలహీనత, వాంతులు, విరేచనాలు, వికారం వంటివి ఒక వ్యక్తిలో కనిపిస్తున్నాయంటే.. దానిని న్యుమోనియా అనుమానించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. వెంటనే తగిన చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారుతుందని చెప్తున్నారు. అది ఎలా వస్తుంది? లక్షణాలేమిటి? వస్తే ఏం చేయాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఎలాంటి వారికి వస్తుంది?
న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. చిన్నపిల్లల్లోను, 65 ఏండ్లు పైబడిన వారిలోను వచ్చే అవకాశాలెక్కువ. గుండె జబ్బులు, డయాబెటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య వంటివి ఉన్నవారిలో ఇంకా త్వరగా వస్తుంది. దీంతోపాటు ఆస్పత్రిలో చేరిన పేషెంట్స్ మరీ ఎక్కువరోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందే క్రమంలోనూ రావచ్చు. అలాగే ధూమపానం చేసేవారికి, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి, హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్, అవయవ మార్పిడి చికిత్సలు పొందిన వారికి, రోగనిరోధక వ్యవస్థ వీక్‌గా ఉన్నవారికి న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువ.
వ్యాధి కారకాలివే..
వైరస్‌లు, బ్యాక్టీరియాలు, కొన్నిసార్లు శిలీంధ్రాలు వంటి పలు రకాల సూక్ష్మజీవులవల్ల న్యుమోనియా వస్తుంది. అత్యంత సాధారణ బ్యాక్టీరియా ద్వారా కూడా న్యుమోనియా వస్తుందని, ఈ పరిస్థితినే స్ట్రెప్టోకోకస్ న్యుమోనియాగా పిలుస్తారని వైద్య నిపుణులు చెప్తున్నారు. హేమోఫిలస్ ఇన్ ఫ్లూ ఎంజా, లెజియోనెల్లా న్యుమోఫిలా, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాలతోపాటు మైకోప్లాస్మా వంటి ఇతర బ్యాక్టీరియాలు తేలికపాటి న్యుమోనియాను కలిగిస్తాయి.
లక్షణాలు
న్యుమోనియా వచ్చిన వ్యక్తుల్లో తరచూ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి : కఫంతో కూడిన దగ్గు, చలిజ్వరం, ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది. తీవ్రమైన అలసట, నీరసంగా అనిపించడం, వాంతులు, విరేచనాలు, వికారం వంటివి ప్రధాన లక్షణాలు. ఇది అంటు వ్యాధి కూడా. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడంవల్ల బయటకు వచ్చే సూక్ష్మ క్రిములు ఇతరులు ఊపిరి పీల్చుకునే సమయంలో వారికిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే లక్షణాలు కలిగిన వ్యక్తులు దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తమ నోటిని, ముక్కును కవర్ చేసేలా కర్చీఫ్‌ను, చేతులను అడ్డు పెట్టుకోవాలి. వ్యాధి బారిన పడినవారు తగ్గేవరకు ఇతరులకు కొంచెం దూరం పాటించాలి. ప్రత్యేక ప్లేటు, కప్పులు యూజ్ చేయడంవల్ల కుటుంబంలో ఇతరులకు సోకకుండా ఉంటుంది. అలాగే బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలి.
ఇలా చేస్తే బెటర్
అలాగే న్యుమోనియాతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మేలు. ఎక్కువగా నీళ్లు, సూప్‌లు, టీ తాగడం చేయాలి. తేనె, కొన్ని చుక్కల నిమ్మకాయతో తయారు చేసిన వెచ్చని పానీయం ఉపశమనం కలిగిస్తుంది. విశ్రాంతి తప్పక తీసుకోవాలి. అలసటకు, ఆందోళనకు గురిచేసే పనులు చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సకాలంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది.
Read more: