- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రివ్యూ: జీసస్‌గా మార్చేసే "ఐ యామ్ జీసస్ క్రైస్ట్".. సాతానుతో పోరాడే ఛాన్స్
దిశ, ఫీచర్స్: కాంట్రవర్షియల్ వీడియో గేమ్ 'ఐ యామ్ జీసస్ క్రైస్ట్' ఫైనల్‌గా అందుబాటులోకి వచ్చింది. 'యేసయ్య'గా మారేందుకు యూజర్లను అనుమతించే గేమ్.. గేమ్ స్టోర్ 'స్టీమ్'లో ప్లే చేయబడింది. పుట్టుక నుంచి శిలువ.. తదుపరి పునరుత్థానం వరకు.. అన్ని స్టేజ్‌ల్లోనూ యేసు పాత్రలో స్వయంగా అద్భుతాలు సృష్టించేందుకు అవకాశమిస్తోంది. యేసు శిష్యులను, ఇతర పాత్రలను కలుసుకోవడానికి వీలు కల్పించడంతో పాటు సాతానుతో పోరాడే చాన్స్ ఇస్తోంది.2019లో ఇండిపెండెంట్ డెవలపర్ 'SimulaM' ఈ గేమ్ గురించి మొదటిసారిగా ప్రకటించింది. ఆ దేవుడి కుమారుడి పాత్రలో జీవించే చాన్స్‌ను అసలు మిస్ చేసుకోవద్దంటున్న 'SimulaM'.. ప్రజలకు గేమ్ ఎలా ఉంటుందో రుచి చూపించేందుకు చిన్న ప్రోలోగ్‌ను మాత్రమే విడుదల చేసింది. నజరేత్ వంటి ప్రదేశాలు.. ముగ్గురు జ్ఞానులను కలుసుకోవడం, ఎడారి గుండా 40 రోజుల ట్రెక్ వంటి బైబిల్ సంఘటనలు మాత్రము ఇందులో ఉన్నాయి. 30కి పైగా బైబిల్ అద్భుతాలు, 60 ఐకానిక్ క్యారెక్టర్లను కలిగి ఉన్న మొత్తం గేమ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. కాగా గేమ్‌ప్లే వ్యవధి కనీసం 10 గంటలు ఉండొచ్చు.
ఇప్పటివరకు 'ఐ యామ్ జీసస్ క్రైస్ట్'పై ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. కానీ తక్కువ ఫ్రేమ్ రేట్, బగ్‌ల గురించి చర్చిస్తున్న కొందరు గేమ్ పేలవంగా ఆప్టిమైజ్ చేయబడిందంటున్నారు. ఇక బైబిల్ దోషాలపై దృష్టి సారించే ప్రతికూల అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గేమ్‌లో మేరీ యొక్క స్పష్టమైన వయసు గురించి సమస్య లేవనెత్తాడు ఓ యూజర్. 'మేరీకి జీసస్ పుట్టినప్పుడు కేవలం 13 ఏళ్లు. కాబట్టి వయోజన జీసస్‌తో ఉన్న మేరీ వెర్షన్ వృద్ధురాలిగా కనిపించకూడదు. ఆమెకు 43 ఏళ్లు మాత్రమే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి విమర్శలు అనివార్యమైనా.. చివరి భోజనం, యేసు శిలువ వంటి సంఘటనలపై జనాలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది.
READ MORE
పొడవైన చెవి వెంట్రుకలు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఇండియన్ హెడ్ మాస్టర్