కామాంధుడి ‘కైలాసం’.. సకల భోగాల శృంగార పురుషుడికి స్పెషల్ కంట్రీ!

by sudharani |   ( Updated:2023-03-16 14:21:37.0  )
కామాంధుడి ‘కైలాసం’.. సకల భోగాల శృంగార పురుషుడికి స్పెషల్ కంట్రీ!
X

దిశ, ఫీచర్స్ : ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశాన్ని వివాదాస్పద, స్వయం ప్రకటిత దైవం నిత్యానంద పరమశివం స్థాపించినట్లు మనం విన్నాం. కానీ ఇదెంత వరకు వాస్తవమనే విషయంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఉనికిలోలేని ఈ దేశం తరఫున ఈ ఏడాది జరిగిన రెండు యునైటెడ్ నేషన్స్ సమావేశాలకు ఆ దేశ ప్రతినిధులు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలో కైలాస కంట్రీ ఎక్కడుందనే విషయంపై గూగుల్ చేసినా గ్లోబ్‌పై కానరాలేదు. గూగుల్ మ్యాప్‌లోనూ ఆనవాళ్లు కనిపించవు. ఇంతకీ నిత్యానంద కథేంటి? భారత్ నుంచి ఎందుకు పారిపోయాడు? కైలాస దేశాన్ని ఎప్పుడు నెలకొల్పాడు? అక్కడ ఎవరెవరు నివసించవచ్చని ప్రచారం చేస్తున్నాడు? ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాడు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

2019లో కైలాసం అనే దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిత్యానంద ప్రకటించాడు. అందుకోసం అతను ఈక్వెడార్ తీరంలో ఒక ద్వీపాన్ని హెడ్ ఆఫీసు కోసం కొనుగోలు చేసినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే దక్షిణ అమెరికా ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. మరో విషయం ఏంటంటే వివాదాస్పద గురువు నిత్యానంద నాలుగేండ్లుగా ఎవరికీ కనిపించలేదు. కానీ కల్పిత దేశంపట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొనేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సంవత్సరం ఈ దేశ ప్రతినిధులు రెండు యునైటెడ్ నేషన్ మీటింగ్‌లకు కూడా అటెండ్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.

లైంగిక ఆరోపణలు

నిత్యానంద పరమ శివస్వామి హిందూమతానికి సంబంధించి ప్రచార గురువుగా, అవతార పురుషుడిగా ప్రకటించకున్న సంగతి తెలిసిందే. అతను సుప్రీం పోప్(supreme pontiff of Hinduism)గా అనుచరులను కలిగి ఉన్నట్లు జనాంతర ప్రకటన వెలువడింది. అయితే అదే సంవత్సరంలో ఒక మహిళ, నిత్యానంద తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. ఈ కేసులో నిత్యానంద అరెస్టయినా కొద్దిసేపటికే బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ ఆ తర్వాత అతనిపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. పిల్లలను కిడ్నాప్ చేసి, గుజరాత్‌లోని ఆశ్రమంలో నిర్బంధించాడని కూడా అలిగేషన్స్ వచ్చాయి.

అయితే ఈ నేపథ్యంలో విచారణ కోసం పోలీసులు నిత్యానందను కోర్టులో హాజరుపర్చడానికి కొన్ని రోజుల ముందు అతను కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. తనకు తాను దేవుడినని ప్రకటించుకున్న వ్యక్తి ఇటీవలి సంవత్సరాలలో కనిపించనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అతని స్పీచ్, వీడియోలు విడుదలవ్వడం మాత్రం ఆగలేదు. పైగా అతని అనుచరులు కైలాసాన్ని 2 బిలియన్ల హిందువుల రాష్ట్రంగా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి ఇది కష్టసాధ్యమే అంటున్నారు నిపుణులు.

ఆశ్రమంలో ఏం జరిగింది?

లైంగిక దాడులు, ద్వేషపూరిత ప్రసంగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడు నిత్యానంద ఇండియాలో దశాబ్దకాలంపాటు ఆశ్రమాన్ని నడిపాడు. అయితే అది భక్తి ప్రచార కేంద్రం కంటే రక్తికి నిలయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హింస, అత్యాచారాలకు నిలయంగా ఆశ్రమాన్ని నడిపించాడని విమర్శలున్నాయి. అతన్ని నిందితుడిగా పేర్కొంటూ కేసులు నమోదైనప్పటికీ అతని అనుచరులు మాత్రం నిత్యపునీతుడని ప్రశంసించారు. నిత్యానందపై కేసులు పెట్టడం, కోర్టుకు తీసుకురావడాన్ని హిందూమతంపై దాడిగా అభివర్ణించారు. పైగా హిమాలయాలలోని ఒక పర్వతానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టినట్లు నిత్యానంద అనుచరులు జనాంతిక ప్రకటన విడుదల చేశారు. ‘ఇది హిందూ దేవుడు శివుని నివాసం’ అంటూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత రకరకాల ప్రకటనలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ప్రారంభించారు. ఇక జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ విజయ ప్రియ నిత్యానంద అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక మహిళ ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస శాశ్వత రాయబారి’గా అటెండ్ అయినట్లు పరిచయం చేసుకొని ప్రసంగించింది. ‘స్వదేశీ హక్కులు స్థిరమైన అభివృద్ధి’ గురించి సందేహాలు కూడా అడిగింది. అయితే ఈ సందర్భంగా స్పందించిన యూఎన్ అధికారి అవి ప్రస్తుత సమావేశానికి ‘సంబంధం లేనివి’ అంటూ బదులిచ్చాడు.

ఈ మీటింగ్‌లో కైలాసాన్ని ‘హిందువులకు మొదటి సార్వభౌమ రాజ్యంగా’ అభివర్ణించిన విజయ ప్రియ.. తమ దేశంలో పౌరులందరికీ ఆహారం, ఆశ్రయం, వైద్యం వంటి అవసరాలను ఫ్రీగా అందిస్తున్నట్లు పేర్కొన్నది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు, వివరాలు మాత్రం లేవు. ఉనికిలో లేని దేశం నుంచి యూఎన్ సమావేశానికి ప్రతినిధి ఎలా అటెండ్ అయ్యారు అనే విషయంపై సమావేశాలు ముగిసిన తర్వాత చర్చనీయంశమైంది. దీనిపై యూఎన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈవెంట్‌లు పబ్లిక్‌గా జరుగుతాయని, సమావేశాలకు ఎవరైనా హాజరు కావచ్చని, అలాగే అనుకోకుండా ఆ మహిళ సమావేశంలో ప్రవేశించి ఉండవచ్చని పేర్కొన్నాడు.

ఈ ఏడాది జనవరిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా గుర్తించబడిందని.. ఇందుకు రుజువుగా యూఎస్ నగరం నెవార్క్ (Newark) సిస్టర్ సిటీ అగ్రిమెంట్‌ను రుజువుగా పేర్కొంది. అయితే ఈ ఒప్పందాన్ని ఇటీవల యూఎస్ అధికారులు రద్దు చేశారు. నెవార్క్ ఆఫీసర్స్ కల్పిత దేశం ప్రతినిధుల ద్వారా మోసపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వివాదాస్పదమైన ఒక వ్యక్తి, లైంగిక ఆరోపణల నిందితుడు, పరారీలో ఉన్న వ్యక్తి స్థాపించిన కాల్పనిక దేశంతో సంబంధం కలిగి ఉండటం యూఎన్‌‌కు మంచిది కాదని పలువురు పేర్కొంటున్నారు.

Also Read..

హనీమూన్ కు నేనూ వస్తా.. పట్టుబట్టిన అత్త..

Advertisement

Next Story