- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థమ్స్ అప్, పెప్సీ తాగితే క్యాన్సర్, హార్ట్ ఎటాక్!
దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే కూల్ డ్రింక్స్‌కు డిమాండ్ పెరిగిపోతుంది. రోజూ లీటర్లకు లీటర్లు తాగేసే జనాలు ఉన్నారు. కానీ షుగరీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే క్యాన్సర్, హార్ట్ ఎటాక్స్‌తోపాటు 45 ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం. వారానికి 355 మి.లీ. కన్నా ఎక్కువ మొత్తంలో శీతల పానీయాలను తీసుకున్నట్లయితే సివియర్ హెల్త్ కండిషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది.
రోజుకు ఆరు టీస్పూన్స్ కంటే ఎక్కువ షుగర్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలో మీరు తీసుకునే ప్రతీ షుగరీ డ్రింక్(పెప్సీ, కోకోకోలా, థమ్స్ అప్, స్ప్రైట్, ఫిజీ) 17శాతం అధికంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్‌కు దారి తీస్తుంది.
ఫుడ్ షుగరీస్ వినియోగం మధుమేహం, గౌట్, ఊబకాయంతో సహా 18 జీవక్రియ సమస్యల మధ్య ముఖ్యమైన హానికరమైన అనుబంధాలు కనుగొనబడ్డాయి. పది హృదయ సంబంధ సమస్యలతో పాటు రొమ్ము, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో సహా ఏడు క్యాన్సర్‌లతో ముడిపడి ఉంది. BMJలో ప్రచురించిన ఫలితాల ప్రకారం, అదనపు చక్కెర ఆస్తమా, దంత క్షయం, నిరాశ వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి: గురక పెట్టేవారికి హెచ్చరిక.. బిగ్గర శబ్దాలతో బ్రెయిన్ ఎఫెక్ట్