- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచాన్ని ఆకర్షించిన 'చుకుడు'.. బతుకుల్ని బెటర్ చేసిన బండి! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః గత 20 సంవత్సరాలుగా.. రెండు అంతర్యుద్ధాలు, సుదీర్ఘంగా కొనసాగుతున్న హింసతో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చాలా మంది ప్రజలకు భద్రత లేకుండా పోయింది. 1994 నుండి, అక్కడ 3 మిలియన్ల మంది చంపబడ్డారని అంచనా! ఎంతో మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని, చెట్టుకొకరు పుట్టకొకరై, బతుకీడుస్తున్నారు. ఇలాంటి వారికి పశ్చిమ రువాండాలో కిజిబా శరణార్థి శిబిరం ఉంది. ఇక్కడ 18,000 మంది కాంగోలు శాంతి నెలకొంటే, స్వదేశానికి తిరిగి రావడం కోసం వేచి చూస్తున్నారు. వీళ్లకు ఆహారం, కట్టెలు, రేషన్‌లను ఐక్యరాజ్యసమితి నెలవారీగా అందజేస్తుంది. అయితే, ఈ లోడ్‌లను తరలించే బాధ్యత చేత్తో తయారుచేసిన చుకుడు (చూ-కూ-డూ) అని పిలిచే ఓ చెక్క స్కూటర్ చేసింది. అప్పటి నుండి అది అక్కడ అన్ని రవాణాలకు ఆధారమయ్యింది. దీన్ని కాంగో పికప్ ట్రక్ అని కూడా పిలుస్తారు.
ఈ చుకుడుతో దాదాపు 500 పౌండ్ల కంటే ఎక్కువ లోడ్లను లాగవచ్చంటే ఆశ్చర్యపోవాల్సిందే! దీనితోనే వాళ్లు కొండగుట్టలు దాటి సరుకు చేరుస్తారు. కిజిబాలో చుకుడును యూకలిప్టస్ చెట్ల కలపను కొడవలితో చెక్కి, తయారుచేస్తారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో చుకుడు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు కూడా చుకుడుతో సరుకుల రవాణా చేస్తూ, డబ్బులు సంపాదిస్తారు. దృఢమైన నిర్మాణం గల ఈ స్కూటర్ గోమాలోని లావాతో కప్పబడిన రోడ్లకు ఎంతో సముచితంగా ఉండటంతో వీరి జీవితాలకు ఇది ప్రధాన ఆధారంగా మారింది.
స్థానికుల దృష్టిలో, ఇది గొప్ప ఆవిష్కరణకు చిహ్నం. సైనిక సంఘర్షణ, పేదరికం కారణంగా వారు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లకు చుకుడు పరిష్కారాన్ని అందిస్తుంది. 1972లో పోర్చుగీస్ పెడ్రో సర్రాకాయో అనే స్థానికి యువకుడు, స్థానికంగా భారీ వస్తువుల రవాణా అవసరాన్ని గుర్తించి, చుకుడును రూపొందించాడు. తర్వాత, అది వారికి ఆధారమయ్యింది. ఒక సాధారణ చుకుడు తయారీకి రూ.4,800 ఖర్చు అయితే, సుమారు రూ.8 వేలకు మార్కెట్లో అమ్ముతారు. ఇక, ఈ అద్బుతమైన ఆవిష్కరణ ఎన్ని పనులు సమర్థవంతంగా చేయగలదో మీరూ చూడండి.
Also Read: Lithium Mining తో పర్యావరణానికి నష్టం : నిపుణులు