ఆ ఫీలింగ్స్‌ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు.. కారణం ఏంటంటే

by Anjali |   ( Updated:2023-06-27 08:49:35.0  )
ఆ ఫీలింగ్స్‌ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు.. కారణం ఏంటంటే
X

దిశ, ఫీచర్స్: కొన్ని ఫీలింగ్స్ పిల్లల సంతోషానికి కారణం అవుతాయి. మరికొన్ని వారిలో ఉత్సాహం నిపంపుతాయి. కానీ తమ స్నేహితులకంటే తాము ఆర్థికంగా బలహీనులమని, పేదలమని తరచూ ఫీలయ్యే పిల్లలు మాత్రం మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థికంగా సమానమని భావించే వారికంటే, ధనవంతులైన స్నేహితులతో సన్నిహింతంగా ఉండేందుకు ప్రయత్నించే యువకులు తాము పేదవాళ్లమని ఫీలవ్వడం అనేది తక్కువ ఆత్మగౌరవం, ఆందోళన, కోపం లేదా హైపర్యాక్టివిటీ వంటి ప్రవర్తనలకు దారితీస్తోందని పరిశోధకులు చెప్తున్నారు.

అలాగే సంపదలో సమానంగా భావించే వారు ఎక్కువ ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారని, సామాజికంగా మెరుగ్గా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. పైగా తమ ఫ్రెండ్స్‌కంటే తాము పేదలుగా లేదా ధనవంతులుగా భావించే వారు ఒక విధమైన ఆందోళనకు గురికావడంవల్ల ఇతరులను వేధించే అవకాశం కూడా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 12,995 మంది 11 ఏళ్ల వయస్సు గల స్నేహితుల సమూహంలో గ్రహించిన ఆర్థిక అసమానతలను పరిశోధకులు ఎనలైజ్ చేశారు. అలాగే 2000 నుంచి 2002 మధ్య జన్మించిన పిల్లలను సర్వే చేయడం ద్వారా వారి కుటుంబ ఆదాయానికి సంబంధించిన డేటాను సేకరించారు. వీటి ఆధారంగా పరిశీలించినప్పుడు తమ ఫ్రెండ్స్‌కంటే తాము పేదలమని భావించే వారి ఆత్మగౌరవం(self-esteem), సమానంగా భావించే వారికంటే 6 నుంచి 8 శాతం తక్కువగా ఉన్నట్లు గమనించారు.

ఎకానమికల్‌గా తమ స్నేహితులతో సమానంగా ఉన్నామని భావించేవారి వారికంటే, పేదవాళ్లమని ఫీలయ్యే పిల్లల్లో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు 11 శాతం ప్రతికూలతను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే పేదలుగా భావించబడే పిల్లలు ఇతరులతో పోల్చినప్పుడు 17 శాతం ఎక్కువగా వేధింపులకు గురవుయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు వెల్లడించారు.


మరోవైపు స్నేహితులకంటే ధనవంతులుగా లేదా పేదలుగా భావించేవారు 3 నుంచి 5 శాతం వరకు ఇతరులను వేధించే చాయిస్ ఉంటుందని పేర్కొన్నారు. అయితే 14 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి ఈ విధమైన పోలికలు కాస్త తగ్గుతున్నప్పటికీ పేదలుగా భావించేవారు ఆర్థికపరమైన సారూప్యత ఉన్న తమ స్నేహితులకంటే 8 శాతం ఎక్కువగా బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉంటోంది. ‘కౌమారదశ అనేది విభిన్న ప్రవర్తనలకు లోనయ్యే వయస్సు. ముఖ్యంగా స్వీయ-నిర్ణయాలను తీసుకోవడానికి, స్వీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, సోషల్ కంపారిజన్స్‌ను అప్లయ్ చేసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది’’ అంటున్నారు సైకాలజిస్టు, పరిశోధకురాలు అయిన బ్లాంకా పియరా పై-సన్యర్. కొన్నిసార్లు ఆయా వ్యక్తుల చుట్టూ ఉండే ఆర్థిక, సామాజిక, భావోద్వేగ పరిస్థితులు యువతను, పిల్లను ప్రభావితం చేస్తుంటాయని ఆమె పేర్కొన్నారు.

Read More..

ఇతరులు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా?.. ఇవి కారణం అయ్యుండవచ్చు!

10 నిమిషాల కంటే టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడుపుతున్నారా? అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే!

Advertisement

Next Story