- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిల్లలు సరిగా నిద్రపోవడం లేదా..? షాకింగ్ విషయాలు తెలిపిన అధ్యయనాలు..!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు టీవి, మొబైల్ వాడుతూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతుంటారు. కొంతమంది తల్లిదండ్రుల వారి పిల్లలు ఎక్కువగా నిద్రపోవడం బద్ధకంగా భావించి, తక్కువ సమయం నిద్రపోయేలా చేస్తుంటారు. అయితే, పిల్లల మెదడు వృద్ధికి నిద్ర అనేది చాలా అవసరం. వాళ్లకి సరైన నిద్ర లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలను గురించి తెలిపింది. పిల్లలకు సరైన నిద్ర లేకపోతే శరీరంలో మార్పులు, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.
జ్ఞాపకశక్తిపై ప్రభావం: పిల్లకు సరైన నిద్ర ఎంతో అవసరం. ఇది వారి మెదడు పనితీరును వృద్ధి చేస్తుంది. ఏదైన విషయాలు నేర్చుకునేందుకు, జ్ఞాపక శక్తికి అవసరమైన నాడీ విధానాన్ని అభివృద్ధి చేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేశాయి. అయితే, పిల్లలు, పెద్దల్లో నిద్ర పాత్ర వేరువేరుగా ఉంటుందని, దీని ప్రభావాలు ఒకేలా ఉండవని తేల్చింది.
పెద్దలకు అవయవాల విశ్రాంతికి నిద్ర అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది పిల్లల విషయంలో భిన్నంగా ఉంటుంది. పిల్లలకు సరైన నిద్ర వారి మెదడు, జ్ఞాపకశక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల మెదడు అభివృద్ధికి, న్యూరాన్ల కనెక్షన్లకు నిద్ర ఉపయోగపడుతుంది. ఒకవేళ నిద్రలో ఆటంకాలు కలిగితే, ఆ ప్రభావం పెద్దల కంటే పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజు నిద్రకు ఒక నిర్ధిష్టమైన షెడ్యుల్ పెట్టుకొని, వారి నిద్రకు భంగం కలగకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా రోజూ సరైన టైమ్‌లో నిద్రపోవడం వారికి అలవాటు చేయడం వల్ల మెదడు పనితీరుపై ఎటువంటి దుష్ఫ్రభావాలు పడకుండా ఉంటాయి. సరైన నిద్ర లేకపోతే మెదడులోని కొన్ని రకాల హార్మోన్లు ప్రభావితమవుతాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే గుణంతో సహా కొన్ని కీలకమైన హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.