ఫోన్ మాయలో పడి బాల్యం కోల్పోతున్న పిల్లలు.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-04-03 13:22:42.0  )
ఫోన్ మాయలో పడి బాల్యం కోల్పోతున్న పిల్లలు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉండటం కామన్ అయిపోయంది. చిన్న తనంలో పిల్లలకు ఆకాశంలో చందమామను చూపించి అన్నం పెట్టేవారు. కానీ, టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లో వీడియోలో చూపించి అన్నం పెడుతున్నారు. దీంతో పిల్లలు కూడా స్మాట్ ఫోన్‌లకు అడిక్ట్ అయిపోయి తమ బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారు.

బాల్యాన్ని ఆనందంగా, ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. చిన్న తనంలో ఆడుకునే ఆటలు, పాడిన పాటలు ఎవరికైనా ఒక అందమైన జ్ఞాపకం. కానీ, స్మార్ట్ ఫోన్ల వల్ల బాల్యంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకునేందుకు కూడా ఏమీ లేకుండా పోతున్నాయి. దీంతో పిల్లలు బాల్యాన్ని ఎంత కోల్పోతున్నారు అనేది ఓ చక్కటి వీడియో ద్వారా చూసి ఇక నుంచి అయినా మీ పిల్లలకు బాల్యం అంటే ఏమిటో ఇప్పటి తరాలు తెలియజెప్పాల్సి ఉంది.

Advertisement

Next Story