సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు

by Anjali |
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు
X

దిశ, ఫీచర్స్: మొన్నటి వరకు కార్తీక మాసం కాబట్టి చికెన్ ధరలు పడిపోయాయి. క్రిస్మస్ వేడుకలు, న్యూయర్ ఈవెంట్స్ రావడంతో ప్రతి ఒక్కరూ బిర్యానీలకు మొగ్గు చూపారు. దీంతో చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించి వ్యాపారస్తులు ధరలు పెంచేస్తున్నారు. దీంతో సామాన్యులు చికెన్ తినడానికి ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో కిలో చికెన్‌ రూ.170 నుంచి రూ.190 వరకు ఉండేది. తాజాగా చికెన్ ధర చూసుకున్నట్లైతే.. రూ.240 కి చేరడం గమనార్హం. మరో 10 రోజుల తర్వాత సంక్రాంతి పండుగ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంట్లో నాన్ వెజ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story