మొటిమల సమస్యతో బాధపడుతున్నారా.. డార్క్ చాక్లెట్‌తో పరిష్కారం..!

by Anjali |
మొటిమల సమస్యతో బాధపడుతున్నారా.. డార్క్ చాక్లెట్‌తో పరిష్కారం..!
X

దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్క అమ్మాయి పదిమందిలో అట్రాక్షన్‌గా నిలవాలని కోరుకుంటుంది. ఇందుకోసం ముఖాన్ని బ్యూటీగా మార్చుకునేందుకు పలు చిట్కాలు పాటిస్తుంటారు.. బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేసియల్స్ చేయిస్తుంటారు. మరికొంత మంది ఇంట్లోనే చిట్కాలు పాటిస్తారు. వయసు పెరుగుతున్నా.. వన్నె తరగని అందం పొందడం అంటే మామూలు విషయం కాదు. అందం కోసం ఎంతో శ్రమించాలి. వేలకు వేలు ఖర్చు చేయాలని.. ఏవేవో ట్రీట్మెంట్లు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ కేవలం ఓ చిన్న డార్క్ చాక్లెట్ ముక్కతో మెరిసిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్లలో ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి ఎన్నో హెల్తీ అంశాలు ఉంటాయి. ఈ చాక్లెట్ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ముఖాన్ని మిలమిల మెరిసేలా చేస్తుంది. కాగా శీతాకాలంలో డార్క్ చాక్లెట్‌తో ముఖానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొంతమంది అందం కోసం బ్యూటీఫార్లర్‌కు వెళితే.. మరికొంతమంది డాక్టర్లను సంప్రదిస్తారు. వైద్యులు ముఖం అందంగా మెరవాలంటే నాణ్యమైన ఆహారం తీసుకుంటే చాలని చెబుతారు. కానీ చాలా మంది పెద్దగా పట్టించుకోరు. హెయిర్ లాస్ అవ్వడానికి, ముఖం పై తొందరగా ముడతలు రావడానికి, తొందరగా వృద్ధాప్యానికి. పింపుల్స్‌కు.. క్వాలిటీ ఆహారమే కారణమని వైద్యులు చెబుతుంటారు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆహారంపై శ్రద్ధ వహించడం లేదు. అయితే తాజాగా నిపుణులు ఫేస్‌ నిగనిగలాడాలంటే డార్క్ చాక్లెట్ బెస్ట్ మెడిసిన్‌గా పనిచేస్తుందని, కేవలం ముఖ సౌందర్యానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చాక్లెట్లను పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటున్నారు. మార్కెట్‌లో చాలా రకాల చాక్లెట్‌లు అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్స్ మితంగా తినడం ఆరోగ్యానికి మేలు.

చాక్లెట్‌తో ఫేస్ మాస్క్..

పొడి చర్మం తో బాధపడుతున్న వారికి డార్క్ చాక్లెట్ ఎంతో ఉపయోగపడుతుంది. డ్రైస్కిన్ ఉన్నవారు మరింత సున్నితమైన స్కిన్‌ను కలిగి ఉంటారు. వారు ఎక్కువ రసాయన ఉత్పత్తులను వాడలేదు. కాగా ఫేస్‌కు చాక్లెట్ రాసుకోవడం వల్ల స్కిన్ పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. దీంతో డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. అలాగే చాక్లెట్‌లో ఉండే కెఫిన్ కంటెంట్ చర్మాన్ని మృదువుగా, బిగుతుగా చేస్తుంది. ఇకపై మీరు చాక్లెట్స్‌ తినడంతో పాటు ఫేస్‌కు కూడా అప్లై చేసుకోండి. ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

మూడ్‌ను రిఫ్రెష్ చేయడం..

కొంతమంది తమ మూడ్‌ని రిఫ్రెష్ చేయడానికి చాక్లెట్ బాగా తింటారు. పిల్లల ఆరోగ్యం బాగుంటుందని, వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని గర్భిణీలు కూడా చాక్లెట్స్ తింటుంటారు. కాగా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ మొదటి స్థానంలో ఉందంటున్నారు నిపుణులు. అలాగే డార్క్ చాక్లెట్ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

డార్క్ చాక్లెట్‌తో పింపుల్స్ చెక్..

నేటి యువతలో పింపుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి కారణం పలు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ఓ కారణమని చెప్పుకోవచ్చు. కాగా ఫేస్‌పై ఎక్కువగా పింపుల్స్‌తో బాధపడుతున్న వారు డార్క్ చాక్లెట్‌ను ఫేస్ పై అప్లై చేయండి. డార్క్ చాక్లెట్ మొటిమల బాధితులకు ఒక వరం. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ , ఫ్లేవనాయిడ్స్ చర్మ కణాలు పాడవకుండా నిరోధించి, మొటిమలను దూరం చేస్తాయి. డార్క్ చాక్లెట్‌లోని కెఫిన్ , థియోబ్రోమిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తాయి.

ఫేస్ గ్లోయింగ్‌ను పెంచుతుంది..

డార్క్ చాక్లెట్ చర్మ ప్రకాశాన్ని పెంచుతుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్కిన్‌కు స్పెషల్ గ్లోయింగ్‌ను ఇస్తుంది. చాక్లెట్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు సూర్యకిరణాల నుంచి స్కిన్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. దీంతో చర్మ కణాలకు ఎలాంటి హాని కలుగదు. డార్క్ చాక్లెట్‌లో కెఫిన్, థియోబ్రోమిన్ అనే కాంపౌండ్స్ చర్మంపై ముడతులు రాకుండా చేయడంతో పాటు గతంలో ఉన్న ముడతలను కూడా తగ్గిస్తాయి. చేదు డార్క్ చాక్లెట్లు ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది ఫేస్‌కు అప్లై చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి.. దీనిని సౌందర్య సాధనంగా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఎంతో మంది ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్‌‌తో ఇన్ని ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలిసి ఉండదు.

Advertisement

Next Story

Most Viewed