- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vegetable: ఈ కూరగాయను ఉడికించి తింటే క్యాన్సర్‌తో పాటు పలు రకాల సమస్యలు మాయం!
దిశ, వెబ్‌డెస్క్: గోరుచిక్కుడు అని తక్కువ అంచనా వేయవద్దు. ఈ కూరగాయ లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు. దీనిలో ఉండే పొటాషియం, ప్రోటీన్, ఖనిజాలు ఫైబర్ శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించడంలో మేలు చేస్తాయి. గోరుచిక్కుడులో ఉండే కాల్షియం బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. కేవలం ఇవే కాకుండా దీంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ ఎ, సి, ఈ, కె, బి 6, ఫోలేట్, కాల్షియం, ఐరన్ మెగ్నిషియం సమృద్ధిగా ఉండే గోరుచిక్కుడు పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను నిర్మించడానికి అవసరమైన పోషకలను అందిస్తుంది. ఈ కూరగాయలో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. గోరు చిక్కుడులోని ఫైబర్ షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.
ట్రిస్టోఫాన్ అనే అలమైనో ఆమ్లం పుష్కలంగా ఉండే ఈ కూరగాయ సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. సెరోటోనిన్ అనేది మానసిక స్థితికి సంబంధించినది. అలాగే గోరుచిక్కుడును ఉడికించి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గోరు చిక్కుడును ఉడికించి సూప్ లేదా సలాడ్ లా తయారు చేసుకోని తాగవచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.