పసిబిడ్డలు చనిపోతే అది ఎవరిపాపమో తెలుసా?

by samatah |
పసిబిడ్డలు చనిపోతే అది ఎవరిపాపమో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పుట్టిన వారు గిట్టక తప్పదు అనేది సత్యం. భూమిపై పుట్టిన ప్రతీ జీవి మరణిస్తుంది.అయితే మరణం అనేది ఒకొక్కరికి ఒకసారి వస్తుంటుంది. కొందరికి త్వరగా వస్తే, మరికొందరి చాలా ఆలస్యంగా వస్తుంది. అయితే కొన్ని సార్లు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే చనిపోతారు. అయితే అలా చనిపోయినప్పుడు అందరూ అంటుంటారు. ఏం పాపం చేసాడని ఆ చిన్నపిల్లాడ్ని దేవుడు అప్పుడే తీసుకెళ్లిపోయాడు అంటారు. అయితే అది పిల్లలు చేసుకున్న పాపం కాదంట.తల్లిదండ్రులు చేసిన పాపాల వల్లనే వారిని దేవుడు త్వరగా తీసుకెళ్తాడంట.

జ్యోతిష్యం ప్రకారం.. పన్నెండు సంవత్సరాల వ‌ర‌కు పిల్ల‌ల‌కు బాలారిష్టాలు ఉంటాయి. అప్పటి దాకా ఆయుర్దాయం లెక్క కట్టకూడదట..ఇక పిల్ల‌లు 4 సంవత్సరాల లోపల చనిపోతే అది మాతృదోషం. అంటే తల్లి చేసిన పాపాల వల్ల‌ బిడ్డ చనిపోయినట్లు అర్థం చేసుకోవాలంట. అదే 4 నుంచి 8 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌లు చనిపోతే అది పిత్రుదోషం. అంటే తండ్రి చేసిన పాపాల వలన బిడ్డ చనిపోయినట్లు లెక్క‌. ఇక 8 నుంచి 12 సంవత్సరాల లోపల చనిపోతే అది బాలుర దోషం. అంటే ఆ పిల్లలు పోయిన జన్మలో చేసిన పాపాల ఫలితంగా మరణిస్తున్నార‌ని అర్థం.

Advertisement

Next Story

Most Viewed