- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips: గుండెపోటు సాధారణంగా తెల్లవారుజామునే ఎందుకొస్తుంది?
దిశ, ఫీచర్స్ : సాధారణంగా గుండెపోటు ఎవరికైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. కానీ చాలా మంది తెల్లవారుజామునే ఈ పరిస్థితిని అనుభవిస్తారని పరిశోధకులు అంటున్నారు. మానవ శరీరంలో అంతర్గత గడియారంగా ప్రసిద్ధి చెందిన 'సిర్కాడియన్ వ్యవస్థ' ఇందుకు కారణమని అధ్యయనాలు చూపించాయని నిపుణులు భావిస్తున్నారు. బ్రిగ్‌హామ్‌కు చెందిన ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. మన శరీరం విడుదల చేసే 'సైటోకినిన్' అరిథ్మియాకు కారణమవుతుంది. ఇదే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభావ్యతను పెంచుతుంది.
'సిర్కాడియన్ వ్యవస్థ' రిథమ్ రోజంతా తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా మెదడుతో పాటు రక్త కణాల్లో కొన్ని రసాయనాలు పెరుగుతాయి, తగ్గుతాయి' అని బ్రిగ్‌హమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో మెడికల్ క్రోనోబయాలజీ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాంక్ స్కీర్ పరిశోధన పత్రంలో వెల్లడించారు. తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల మధ్య బ్లడ్ ప్లేట్‌లెట్స్ అతుక్కొని ఉన్నప్పుడు చాలా వరకు కార్డియాక్ అరెస్ట్‌లు జరుగుతాయని, అడ్రినల్ గ్రంథుల నుంచి ఉత్పన్నమయ్యే ఆడ్రినలిన్ పెరగడం వల్ల కరోనరీ ధమనుల్లో ఫలకం చీలిపోతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్‌కు కారణమేమిటి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుండెపోటు లేదా గుండె ఆగిపోవడానికి అత్యంత సాధారణ కారణం కరోనరీ హార్ట్ డిసీజ్. రోజులు గడిచేకొద్దీ ధమని గోడల వెంట ఫలకం(ప్లేక్) పేరుకుపోయి రక్తనాళాలను ఇరుకుగా చేస్తుంది. గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిరోధించడం ద్వారా ఈ సమస్య తీవ్రంగా మారుతుంది.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు :
కార్డియాక్ అరెస్ట్‌కు సంబంధించి స్త్రీ పురుషులిద్దరికీ వివిధ సంకేతాలు, లక్షణాలు ఉన్నాయి. మహిళలు అజీర్ణం లేదా గ్యాస్‌ను పోలి ఉండే సూక్ష్మ లక్షణాలను కలిగి ఉండగా.. పురుషులకు మరింత బలమైన సంకేతాలు ఉన్నాయి. వీటిలో అత్యంత సాధారణంగా కనిపించేవి :
* ఛాతిలో నొప్పి
* ఛాతిపై భారం, ఒత్తిడి
* వికారం, అజీర్ణం, గుండెల్లో మంట వంటి భావాలు
* కడుపులో నొప్పి
* శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* చల్లని చెమటలు
* ఆకస్మిక అలసట, అలసట
ఇవి కూడా చదవండి :