- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిల్లలు కలగడం లేదా.. మీ కారు సీటు కూడా ఒక కారణమని మీకు తెలుసా?
దిశ, ఫీచర్స్: పెళ్లైన ప్రతీ జంట పండంటి పాప, లేదా బాబు పుట్టాలని కోరుకుంటారు. కానీ ఈరోజుల్లో పిల్లలు కలగడం అనేది కష్టమైపోయింది. ప్రస్తుతం చాలా మందిని సంతానలేమి సమస్య వేధిస్తుంది.మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ కావడం వలన సంతానలేమి కలుగుతోంది. గత కొంతకాలం నుంచి పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతూ వస్తుందని ఈ మధ్యకాలంలో అనేక సర్వేల్లో వెళ్లడైన విషయం మనకీ తెలిసిందే.
అయితే ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు, వృషణాలు వేడెక్కడం, డ్రగ్స్ ఉపయోగించడం, అంటువ్యాధులతో పాటు ఒత్తిడి, ఆందోళనలు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి కారణం అవుతున్నాయంటున్నారు వైద్యులు.కాగా, తాజాగా సంతానలేమి గురించి షాకింగ్ విషయాలు వెలుగులో వచ్చాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి సంతానం లేమికి , కారు సీటు కూడా కారణం అని ఇంగ్లాడ్ సైంటిస్ట్‌లు తేల్చి చెప్పేసారు. స్పెర్మ్ ఉత్ప్తి చెందాలన్నా, నాణ్యతగా ఉండాలంటే పురుషులు శరీరంలోని అన్ని భాగాలకంటే వృషణాలు చల్లగా ఉండాలంట. అయితే ఇప్పుడు ఏ చిన్న పనికోసమైనా సరే బైక్ లేదా కారు ఉపయోగిస్తున్నారు. ఇక కారు,బైక్ సీట్లు అత్యధిక వేడిని విడుదల చేస్తాయి. అందువలన కారు లేదా బైక్ సీటుపై ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణం చేయడం వలన వృషణాలు వేడెక్కి, స్పెర్మ్ తగ్గిపోతుందంట.