శానిటరీ ప్యాడ్స్ వాడే వారికి షాకింగ్ న్యూస్.. క్యాన్సర్, పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువంటూ రిపోర్ట్!

by samatah |   ( Updated:2022-11-23 15:27:29.0  )
శానిటరీ ప్యాడ్స్ వాడే వారికి షాకింగ్ న్యూస్.. క్యాన్సర్, పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువంటూ రిపోర్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : శానిటరీ ప్యాడ్స్ వాడే వారికి షాకింగ్ న్యూస్. భారతదేశంలో విక్రయించే శానిటరీ ప్యాడ్స్‌లో హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఓ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ ఎన్టీవో చేసిన అధ్యనంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 10 శానిటరీ నాప్ కిన్‌లలో థాలేట్‌లు ఉన్నట్లు తేలింది. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ వాడటం వలన క్యాన్సర్, సంతానలేమి లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చిరించింది.

టాక్సిక్స్ లింక్ ఎన్జీవో సర్వే ప్రకారం.. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న శానిటరీ ప్యాడ్స్‌లలో థాలేట్స్, వీవోసీల వంటి విషపూరిత రసాయనాలు ఉన్నాయని, ఫ్లెక్సిబిలిటీ, పారదర్శకత, మన్నిక వంటి వాటిని పెంచడం కోసం ప్లాస్టిక్‌కు థాలేట్స్‌ను కలుపుతున్నారని తెలిపారు. ఇక ఈ థాలేట్స్ వలన క్యాన్సర్, సంతోనాత్పోత్తి, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, టెస్టిక్యుులర్ డిస్జెనిసిస్ సిండ్రోమ్‌కు దారి తీస్తుందని పరిశోధకులు సూచనలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

కల్తీ ప్రొడక్ట్స్‌ను ఇలా ఈజీగా గుర్తుపట్టొచ్చు... తెలుసా?

Advertisement

Next Story