- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య ఎఫెక్ట్.. హాట్ టాపిక్‌గా 500 నోట్లు రద్ధు ?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎవరినోట విన్నా అయోధ్య రామయ్య ముచ్చటే వినిపిస్తుంది. జనవరి22న అయోధ్యలో బాల రాముడి విగ్రహం ప్రతిష్టించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు ఊపందుకున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో భారతీయ కరెన్సీ నోట్లపై మహాత్మగాంధీ స్థానంలో శ్రీరాముడి ముద్రతో కూడిన 500 నోట్లు వైరల్అ య్యాయి. దీంతో త్వరలో శ్రీరాముడి ఫోటోతో కూడిన 500 నోట్లు జారీ కానుందని, నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్‌బీఐ దీని పై నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఎర్రకోట స్థానంలో అయోధ్య రామమందిరం, శ్రీరాముడి ఫొటోతో కూడిన 500 నోట్లు రానున్నాయంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. దీంతో జనాలు తెగ అయోమయంలో పడిపోయారు. నిజంగానే పాత 500 నోట్లు రద్ధు కానున్నాయా? ఇక నుంచి శ్రీరాముడ ఫొటో ఉన్న 500నోట్లే వస్తాయా అని ఆలోచనలో మునిగిపోయారు.
దీనిపై కొంత మంది నెటిజన్స్ స్పందిస్తూ.. నిజంగానే పాత500ల రూపాయల నోట్లు రద్ధు చేస్తే ఆర్‌బీఐ అధికార ప్రకటన చేసేది.కానీ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టీ ఇవన్నీ పుకార్లే, ఇలాంటివి నమ్మోద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.