- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిండివంటలు చేసిన నూనె మిగిలిందా.. ఇలా క్లీన్ చేయండి..
దిశ, ఫీచర్స్ : మనం ఇంట్లో పిండివంటలు, స్నాక్స్ చేసినప్పుడు చాలా వరకు నూనెలు బాండీలో మిగిలిపోతాయి. అయితే ఆ మిగిలిన నూనెను కొంతమంది అలాగే వంటల్లో వాడతారు. మరి కొంత మంది ఆ నూనెను కొన్ని టిప్స్ ఉపయోగించి శుద్ధి చేసుకుంటారు. ఏంటి ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటున్నారా.. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..
కార్న్‌ఫ్లోర్..
పిండివంటలు చేసిన నూనెలో అడుగుభాగంలో ఉన్న అవశేషాలను తొలగించాలంటే కార్న్‌ఫ్లోర్ బాగా ఉపయోగపడుతంది. మక్కపిండిలో కాస్త నీళ్లను పోసి బజ్జీ పిండి బ్యాటిల్ లా తయారు చేసుకోవాలి. ఆ తరువాత మిగిలిన నూనె బాండీని పొయ్యిపై పెట్టి నూనెను బాగా మరిగించి అందులో మక్కపిండిని వేయాలి. అప్పుడ ఆ పిండి నూనె అడుగు భాగంలోకి వెళ్ళి మాడిన పిండిపదార్థాల అవశేషాలకు అతుక్కుంటాయి. అప్పుడు మక్కపిండిని తీయడం ద్వారా అవశేషాలు కూడా వచ్చేసి నూనె శుద్ధి అవుతుంది. అలా శుద్ది చేసిన నూనెని వంటల్లో, టిఫిన్లలో వాడుకోవచ్చు. ఆ తరువాత గిన్నెల్ని మనం నిమ్మరసం, సబ్బుతో కలిపి క్లీన్ చేస్తే జిడ్డు లేకుండా క్లీన్ అవుతుంది.
ఇవి మరువొద్దు..
ఒకసారి వాడిన నూనెని మరోసారి ఉపయోగించకపోవడమే మంచిది. ఈ నూనెని మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే ఫ్రై చేసేటప్పుడే తక్కువ పరిమాణంలో నూనెను తీసుకుని ఫ్రై చేయాలి. ఎయిర్ ఫ్రయర్స్ వాడండం వలన నూనె ఎక్కువగా వేస్ట్ అవ్వదు. నూనె పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే, వీలైనంత వరకూ ఈ ఆయిలీ ఫుడ్స్, స్నాక్స్‌కి దూరంగా ఉండడం మంచిది.