- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుమ్మడికాయ తింటే.. ఇన్ని రకాల జబ్బులు మాయమా? అవి ఏంటో తెలుసా?
దిశ, వెబ్డెస్క్: గుమ్మడికాయ తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాయలో బీటా కెరోటిన్, విటమిన్ సి లాంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటే ఈ గుమ్మడికాయ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
* గుమ్మడికాయలో ఉండే ‘విటమిన్ ఎ, విటమిన్ బి’ లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.
* దీంతో పాటు తెల్లరక్త కణాలను పెంచుతుందట.
* పండ్లు, కూరగాయలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడికాయలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి.
* ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికీ ఎంతగానో మేలు చేస్తోంది.
* ఈ కాయలో ఉండే విటమిన్ సి వడదెబ్బ, చర్మం పోడి బారకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.
* విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాక.. కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని ధృడంగా ఉంచుతుంది.
* అలాగే చర్మం తేమగా, ఎంతో అందంగా కనిపించేందుకు సహాయపడుతుంది.
* గుమ్మడికాయనే కాదు.. దీని గింజలు కూడా ఆరోగ్యంగా ఉంచడానకీ ఎంతో మేలు చేస్తాయి. దీని విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ వ్యాధి ఉన్నవాళ్లు గుమ్మడికాయ గింజలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి : చేతులు శుభ్రం చేసుకోవడం.. అతీత శక్తుల పనేనా?