గర్భిణీ స్త్రీలు కాఫీలో రోజు ఎన్ని మిల్లీ గ్రాముల కెఫీన్ వాడాలి..?పరిశోధకులు ఏం చెబుతున్నారు!!

by Anjali |
గర్భిణీ స్త్రీలు కాఫీలో రోజు ఎన్ని మిల్లీ గ్రాముల కెఫీన్ వాడాలి..?పరిశోధకులు ఏం చెబుతున్నారు!!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ, కాఫీ తాగనిది వారికి రోజే గడవదనుకోండి. అయితే మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో కాఫీ తాగొచ్చా? లేదా అని సందేహాలు కలుగుతాయి. తప్పకుండా కాఫీ తాగకుండా ఉండాలని ఎవరూ చెప్పట్లేదు కానీ స్త్రీలు గర్భం దాల్చాక పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తాజాగా గైనకాలజిస్ట్స్‌లు వెల్లడిస్తున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒమెస్ట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ చెప్పిన దాని ప్రకారం.. గర్భిణీ స్త్రీలు 200 మిల్లీ గ్రాముల కెఫీన్ మించి తాగకూడదని అంటున్నారు. ఇది ఒక రోజులో పాటించాలి. కెఫీన్ బాడీలోకి ఎంత వెళ్తుందన్న విషయాన్ని గ్రహించాలి.

లేకపోతే పిండంపై ఎఫెక్ట్ చూపే అవకాశాలున్నాయని వెల్లడించారు. కెఫీన్ అధికంగా శరీరంలోకి వెళ్తే గర్భాశయం, ప్లాసెంటాలోని రక్తనాళాలు పాడవుతాయి. దీంతో పిండానికి బ్లడ్ సర్కులేషన్ అనేది తగ్గిపోతుంది. పిండం ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రెగ్నెన్సీ మహిళలు అనూహ్యంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణి స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే..? నైట్ తిన్న తర్వాత కాఫీ అస్సలు తాగకూడదు. ఒకవేళ తాగితే పాలు ఎక్కువగా ఉన్న కాఫీ తాగండని సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story