- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Effects of vitamin D in Pregnancy: విటమిన్ డి లోపం వల్ల ప్రెగ్నెన్సీ రాదా..?
దిశ, ఫీచర్స్: ప్రతీ మహిళ జీవితంలో గర్భం దాల్చడం అనేది కీలకమైన ఘటం. ఒక వైపు బిడ్డకు జన్మనిస్తున్నాను అనే సంతోషంతో పాటుగా ఏదో తెలియని కొంత భయం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం అవసరమైన పోషకాలను అందేలా అసరైన ఆహారంను తీసుకోవాలి. ఈ పోషకాలలో ముఖ్యంగా విటమిన్ డి అనేది గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. విటమిన్ డి లోపం కారణంగా శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. కండరాలు బలహీనమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిలో విటమిన్ డి తక్కువగా ఉన్నట్లైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భాధారణ సమయంలో విటమిన్ డి అనేది చాలా అవసరం. ఇది కాల్షియం, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి అనేది చాలా ముఖ్యమైనది. గర్భిణీలలో విటమిన్ డి లోపాన్ని ప్రీ-ఎక్లాంప్సియా అని అంటారు. ఇది గర్భం దాల్చిన 20 వారాల తరువాత దీని ప్రభావాన్ని చూపుతుంది. గర్భాధారణ సమయంలో విటమిన్ డి తక్కువగా ఉంటే గర్భశ్రావం, ముందస్తు ప్రసవం, గర్భాధారణ మధుమేహం, డెలివరీ సమయంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ విటమిన్ డి అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ లోపం కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ లోపం అనేది ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటి వాటి కారణంగా ఏర్పడుతుంది. గర్భధారణ టైమ్‌లో సాధారణ విటమిన్ డి స్థాయి 30 mg/ml లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. దీని వల్ల తల్లిబిడ్డకు ఎటువంటి సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఈ లోపాన్ని అధికమించాలంటే తప్పనిసరిగా కూరగాయలు, పాల ఉత్పత్తులు, పండ్లు, గింజలు, పెరుగు, కొవ్వు చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, బాదం, తృణ ధాన్యాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. వీటిలో విటమిన్ డి సంవృద్ధిగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతీ రోజూ కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Kids Food: పిల్లలకు ఇలాంటి ఆహారాలు పెడుతున్నారా.. దీనిపై ఎఫెక్ట్ చూపుతుంది