Health: చల్లని ఆహారం తీసుకోవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Prasanna |
Health: చల్లని ఆహారం తీసుకోవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది ఆహారాన్ని వేడిగా కన్నా చల్లగా తినడానికే ఆసక్తి చూపుతుంటారు. కానీ, ఇది మంచి పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు. చల్లటి ఆహారం తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అసలు ఇలా చల్లటి ఎందుకు ఆహారాన్ని తీసుకోకూడదు.. దాని వలన కలిగే సమస్యలు గురించి ఇక్కడ చూద్దాం..

బలహీనమైన జీవక్రియ

చల్లని ఫుడ్ తినడం వలన జీవక్రియ సమస్యలు వస్తాయి. ఎందుకంటే కడుపులో చల్లని ఆహారాన్ని జీర్ణం చేయడానికి చాలా శక్తి కావాలి. దీని కారణంగా శక్తి మొత్తం తగ్గిపోయి కేలరీస్ ను బర్నింగ్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని వలన ఊబకాయం కూడా వస్తుంది.

జీర్ణక్రియ

కొందరు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ ని తింటారు. దీని వలన తీసుకున్న ఆహరం త్వరగా జీర్ణమవుతుంది. దాని వలన చల్లటి ఆహరం తినడం వల్ల పొట్టలో ఎన్నో సమస్యలు వస్తాయి. అంతే కాకుండా కడుపు నొప్పి ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది.

ఫుడ్ పాయిజనింగ్

వేడి ఆహారాల కంటే చల్లని ఆహారాలలో సహజంగా బ్యాక్టీరియా పెరుగుదలకు ఎక్కువ అవకాశం కలిగి ఉంటాయి. అంతే కాకుండా, చల్లని బియ్యాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు, అది బాసిల్లస్ సెరియస్ వంటి హానికరమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తుంది. ఇది ఆహారంలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది అలాగే ఫుడ్ పాయిజనింగ్ సమస్యను కూడా పెంచుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed