Bumper Offer: రండి బాబూ రండి.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. క్యూ కడుతున్న జనాలు.. ఎక్కడంటే?

by Kavitha |   ( Updated:2024-07-31 06:33:05.0  )
Bumper Offer: రండి బాబూ రండి.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. క్యూ కడుతున్న జనాలు.. ఎక్కడంటే?
X

దిశ, ఫీచర్స్: బేసిక్‌గా చాలామంది సింగిల్స్ తమకంటూ ఒక తోడు లేదని చాలా బాధపడుతుంటారు. ఒక ముద్దు ముచ్చట లేదని తెగ ఫీల్ అయిపోతుంటారు. మరి అలాంటి వారి కోసం ఓ వినూత్న ఆఫర్ వచ్చేసింది.. ఇది సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. బంపర్ ఆఫర్.. కాకపోతే ఇది కేవలం లవర్ లేకుండా సింగిల్‌గా ఉంటున్న బాయ్స్ కోసమే. అలాంటివారు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇండియాలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఈ చిత్రవిచిత్రమైన ఆఫర్ వాడుకలో ఉన్నది మాత్రం చైనాలో. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ హవా నడుస్తుంది. అక్కడ యువతులు వీధుల్లో స్టాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ ‘లవ్ మీ ఇఫ్ యు కెన్’(Love Me If You Can) అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, లోన్లీగా ఫీల్ అయ్యే సింగిల్ కుర్రాళ్ల కోసం చైనాలోని షెన్‌జెన్ నగర వీధుల్లో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతో ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కిస్, హగ్ అంటూ ప్రత్యేకమైన సేవలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్‌కు అక్కడ ఉన్న సింగిల్స్ బాయ్స్ ఎక్కువగా ఆకర్షితులై క్యూ కడుతున్నారట.

అయితే ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవలకు కూడా ఛార్జ్ ఉంటుందట. హగ్‌కు 11 రూపాయలు(1 యువాన్), కిస్‌కు 110 రూపాయలు(10 యువాన్), చూడటానికి రూ.150(15 యువాన్) చెల్లించాలని తెలుస్తోంది. అలాగే ఇంటికి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి డ్రింక్ చేయాలంటే.. గంటకు రూ. 461(40 యువాన్) చెల్లించాలట. ఇక ఇప్పుడు ఈ చైనా స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ప్రపంచమంతా హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story