నవ వధువు ఆలోచనకు నెటిజన్లు ఫిదా.. పెళ్లైన వెంటనే అవి చూసేందుకు ప్లాన్

by sudharani |   ( Updated:2022-08-09 09:24:28.0  )
నవ వధువు ఆలోచనకు నెటిజన్లు ఫిదా.. పెళ్లైన వెంటనే అవి చూసేందుకు ప్లాన్
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎవరైనా తమ పెళ్లి వేడుకలకు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్‌ను నియమించుకుంటారు. కానీ మ్యారేజ్ తర్వాత వారి నుంచి తమ ఆల్బమ్, వీడియోలు పొందేందుకు ఎంతకాదన్నా నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఈ ప్రాసెస్‌ను ముందుగానే ఊహించిన ఒక వధువు.. తన మ్యారేజ్ పుటేజ్‌ను ఎలాగైనా మరుసటిరోజే చూడాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే మ్యారేజ్ ఫొటోస్, వీడియోలను వెడ్డింగ్ ప్లానర్ ద్వారా తన ఫోన్‌లో రికార్డ్ చేయించింది. 'పెళ్లైన రెండు మూడు నెలల వరకు ఫొటోలు అందవు. అందువల్లే నా ఫోన్‌ను వెడ్డింగ్ ప్లానర్‌కి ఇచ్చి ప్రతీ ఫుటేజ్‌ కవర్ చేయమన్నాను. దీంతో మరుసటి రోజే నా పెళ్లిని తిరిగి చూడగలిగాను' అని ఆమె చెప్పింది. కాగా ఈ నవ వధువు ఆలోచన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'ఈ ఆలోచన చాలా బాగుంది. మేము కూడా మా పెళ్లికి ఒక వెడ్డింగ్ ప్లానర్‌ను ఎంచుకుంటాం' అని కామెంట్‌ చేస్తున్నారు.

రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల.. 60 శాతం మరణాలపై ప్రభావం

Advertisement

Next Story

Most Viewed