Bp Reading : ఏజ్‌‌ను బట్టి రక్తపోటులో మార్పులు.. ఏ వయస్సులో ఎంత ఉంటే మంచిది?

by Javid Pasha |
Bp Reading : ఏజ్‌‌ను బట్టి రక్తపోటులో మార్పులు.. ఏ వయస్సులో ఎంత ఉంటే మంచిది?
X

దిశ, ఫీచర్స్ : అధిక రక్తపోటు.. ఒకప్పుడు పెద్ద వయస్సు గలవారిలోనే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతను కూడా వేధిస్తోంది. ఒత్తిడితో కూడిన జీవన శైలి, పోషకాలు లోపించిన ఆహారపు అలవాట్లు వంటివి కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుదల, గుండె పనితీరులో మార్పులు వంటివి హైబీపీతో ముడిపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటువల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులు దానిని అదుపులో ఉంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఏజ్‌ను బట్టి ఎప్పుడెప్పుడు ఎంత రీడింగ్ ఉండాలో ఇప్పుడు చూద్దాం.

*18 నుంచి 40 ఏండ్ల లోపు వయస్సులో ఉన్న పురుషులు అయితే 119/70 మి.మీ. బీపీ రీడింగ్ కలిగి ఉంటే ఆరోగ్యకరమైన స్థాయిగా పేర్కొంటారు. ఇక మహిళల విషయానికి వస్తే అది 110/68 మి.మీ. ఉండాలి.

* 40 నుంచి 56 ఏండ్ల వయస్సులో ఉన్న పురుషులుకు 124/77 మి.మీ., మహిళలకైతే 122/74 మి.మీ. బీపీ రీడింగ్ ఉండటం నార్మల్‌గా భావిస్తారు. ఇక 60 ఏండ్లు పైబడిన పురుషులకైతే 133/69 మి.మీ బీపీ రీడింగ్‌ను ఆరోగ్యకరమైన స్థాయిగా, ఇదే ఏజ్ మహిళలకు 139/68 బీపీ రీడింగ్‌ను సాధారణ స్థాయి రక్తపోటుగా నిపుణులు పరిగణిస్తారు. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువకాలం జీవించాలంటే రక్తపోటు 100/70 మి.మీ.గా ఉండేలా చూసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story