- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అబ్బాయిలు!! పెళ్లికి అమ్మాయిలు దొరకడం లేదా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
దిశ, వెబ్‌డెస్క్: పురాతన కాలంలో ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే చంపేసేవారు. లేకుంటే లింగ నిర్ధారణ చేసి గర్భంలోనే ఆడపిల్లని కరిగించేసే వారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఆడపిల్లల మరణాలు తగ్గాయి. ఇది శుభపరిణామమే అయినా.. మొన్నటి వరకు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కట్నాలు, కానుకలు, జాబులు అంటూ పెద్ద యుద్దమే జరిగేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. నేటి సమాజంలో అమ్మాయిల పెళ్లి చేయడానికి పడే ఇబ్బంది కంటే.. అబ్బాయిలకు పెళ్లిల్లు కావడం చాలా కష్టంగా మారింది. సగటున 100 మంది అబ్బాయిలకు 90 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.
దీంతో పాటు అమ్మాయిలకు సగటు పెళ్లి వయసు పెరిగింది. గతంలో 18 సంవత్సరాలకే ఆడపిల్లకి పెళ్లి చేసేవారు. ఇప్పుడు అది 23 కి పెరిగింది. అయితే.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అబ్బాయిలకు అమ్మాయిలో ఎందులో తక్కువ కాదు అన్నట్లు ఎదుగుతున్నారు. వారితో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలకు పెళ్లిలు కాకపోవడానికి ఇదీ ఓ కారణంగా చెప్పొచ్చు. 2017లో వారి సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లు కాగా, 2020లో అది 22.7 ఏళ్లకు చేరిందని జాతీయ సర్వేలో తేలింది. దేశంలోనే అత్యధికంగా కశ్మీరీ యువతులు 26 ఏళ్లకు, జార్ఖండ్, బెంగాల్ వనితలు అత్యల్పంగా 21 ఏళ్లలోపే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. సో.. అబ్బాయిలు జాగ్రత్త పడే సమయం వచ్చింది. పెళ్లి చేసుకోవాలంటే సంబంధం వచ్చిన వెంటనే మూడు ముళ్లు వేయడం బెటర్. అమ్మాయి నచ్చలేదు.. కట్నకానుకలు తగ్గాయి అంటూ వంకలు పెడితే జీవితాంతం బ్రహ్మచారిగా ఖాయమంటున్నారు పెళ్లిలా పేరయ్యలు.