నిరాశలో ఉన్నారా..? మీ కాన్ఫిడెన్స్ ఇలా బూస్ట్ చేయండి...

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-12 16:07:29.0  )
నిరాశలో ఉన్నారా..? మీ కాన్ఫిడెన్స్ ఇలా బూస్ట్ చేయండి...
X

దిశ, ఫీచర్స్ : ఆత్మవిశ్వాసం పొందించుకోవడం అనేది వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడం, ఇతరులతో వ్యవహరించే తీరు, మీ సొంత సామర్థ్యాన్ని గ్రహించడం వంటి విషయాలను ప్రాథమికంగా ప్రభావితం చేస్తుంది. అందుకే నిరాశలో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటున్న నిపుణులు.. ఇందుకు సంబంధించిన కొన్ని సూచనలు అందిస్తున్నారు.

అచీవబుల్ గోల్స్

పెద్ద టాస్క్ లను చిన్న చిన్నగా, మేనేజబుల్ స్టెప్స్ గా బ్రేక్ చేయండి. మీరు ఆ చిన్న స్టెప్స్ అచీవ్ అయినప్పుడు మీలో సాధించామన్న ఉత్సాహం పెరుగుతుంది. ఇది మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. నెక్స్ట్ స్టెప్ అచీవ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇలా క్రమంగా చాలెంజెస్ పెంచుతూ వెళ్ళమని చెప్తున్నారు నిపుణులు.

సెల్ఫ్ కంపాషన్

మీకు మీరు దయగా ఉండండి. ముఖ్యంగా మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం పనులు జరగనప్పుడు ఇలా ఉండటం మంచిది. లేదంటే స్వీయ విమర్శ.. మిమ్మల్ని సక్సెస్ కు దూరంగా ఉంచగలదు. అందుకే మీ ప్రయత్నం, కష్టాన్ని గుర్తించమని చెప్తున్నారు. ఇది కాలక్రమేణా విశ్వాసాన్ని పెంపొందించడానికి హెల్ప్ చేస్తుంది.

కంఫర్ట్ జోన్ బయటకు రండి

మీ కంఫర్ట్ జోన్ లోనే ఉండకుండా... బయటకు రావడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. కొత్త కార్యకలాపాలను ప్రయత్నించేందుకు.. మిమ్మల్ని భయపెట్టే సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి.

పాజిటివ్ విజువలైజేషన్

మిమ్మల్ని భయాందోళనకు గురిచేసే పనుల్లో విజయం సాధించినట్లు ఊహించుకోండి. అడ్డంకులను అధిగమించడం, గొప్ప నిర్ణయాలు తీసుకోవడం, విజయం గురించి గర్వపడటం ఇమాజిన్ చేసుకోండి. ఈ మెంటల్ రిహార్సల్స్.. మిమ్మల్ని ఇందుకు సిద్ధం చేస్తాయి. విశ్వాసాన్ని పెంచుతాయి.

బాడీ లాంగ్వేజ్

ఆత్మవిశ్వాసంతో కూడిన బాడీ లాంగ్వేజ్ మిమ్మల్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రాపర్ స్టాండింగ్, ఐ కాంటాక్ట్, తరుచుగా స్మైల్ చేయడం.. మిమ్మల్ని మీరు క్యారీ చేసుకునే విధానం.. మీ మైండ్ సెట్ ను పాజిటివ్ గా ఇన్ ఫ్లూయన్స్ చేస్తుంది. మీరు మరింత నమ్మకంగా, శక్తివంతంగా ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed