- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Relationship: భాగస్వామికి ఏకాంతాన్ని అందించడం గొప్ప లక్షణమంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: ‘నాకు కొంచెం పర్సనల్ పనుంది.. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు.. నాకంటూ పర్సనల్స్ ఉండవా’.. భాగస్వామి నోటి నుంచి వెలువడే ఇటువంటి మాటలు కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. ఇద్దరం ఒక్కటే అయినప్పుడు ఇలాంటి వ్యక్తిగత అవసరాలు ఏంటని బాధపడిపోతుంటారు. కానీ ఆ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటే ఆ బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెప్తున్నారు. పార్టనర్ పర్సనల్ స్పేస్ అడిగే సరికి ఎందుకలా అడుగుతున్నారనే అనుమానం, ఆందోళనకు గురికాకుండా.. గౌరవించడం గొప్ప విషయం అని వివరిస్తున్నారు. నిజానికి దీన్ని మనిషిలోని అద్భుతమైన గొప్ప లక్షణంగా అభివర్ణిస్తున్నారు.
భార్యా భర్తలు కావచ్చు.. సహజీవనం చేస్తున్న వ్యక్తులు కావచ్చు.. ఏ రకమైన రిలేషన్‌షిప్‌లో అయినా సరే ‘నేను కొంచెం మాట్లాడాలి. నువ్వు నన్ను ఫ్రీగా ఉండనివ్వట్లేదు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావ్’ ‘నీవల్ల నేను చాలా కోల్పోతున్నాను. నాకంటూ పర్సనల్స్ ఉంటాయి కదా నామానాన నన్ను వదిలెయ్. నాకు రెస్టు కావాలి’ అనే మాటలు సహజమే. కొందరికి ఇవి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య అండర్ స్టాండింగ్ ఉంటే ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. పైగా పార్ట్‌నర్ అడిగినప్పుడు పర్సల్ స్పేస్ ఇవ్వడం అనేది ఆదర్శవంతమైన వ్యక్తిత్వ లక్షణం.
బంధం బలపడుతుందా?
భాగస్వామితో పర్సనల్ స్పేస్ కోరుకోవడం అనేది అనుబంధాల మధ్య అనుమానాలకు తావిస్తుందని కొందరు చెప్తుంటారు. కానీ అలాగే ఎందుకు అనుకోవాలి. అందరూ అలాగే ఉండరు కదా. రిలేషన్ షిప్‌లో ఉన్నా సరే. ప్రతీ వ్యక్తికి వ్యక్తిగతంగా కొంత సమయం తీసుకోవడం ఒక హక్కు కూడా. అటువంటి అవకాశం ఇవ్వడం వల్ల జంటల మధ్య అనుబంధం మరింత బలపడటానికి దోహదం చేస్తుంది. అయితే పర్సనల్ స్పేస్ కోరుకుంటున్న వ్యక్తి కూడా తన వ్యక్తిగత సమయంలో కొన్ని ఆరోగ్యకరమైన పరిమితులు కలిగి ఉంటే భాగస్వామి విశ్వాసాన్ని మరింత పొందగలుగుతారు.
ఆందోళన కలిగించే అంశాలేవి?
భాగస్వామి సహజంగానే తన స్నేహితులు లేదా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి వ్యక్తిగతంగా సమయం అవసరం. అదే సందర్భంలో ఆ స్పేస్‌ను దుర్వినియోగం చేయడం అనేది ఎదుటివ్యక్తిని ఆందోళన కలిగిస్తుంది. నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఎక్కడ ఎటువంటి పరిమితులు అవసరమో, ఎప్పుడు వ్యక్తిగత సమయం కావాలో అప్పుడే తీసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. మొత్తం మీద పర్సనల్ స్పేస్ అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం, భావోద్వేగాలు వంటి అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. ప్రత్యేక అవసరాలను తీర్చుకోవడం అనే భావం కూడా ఇందులో ఉంటుంది. ఇందులో వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం కూడా ఉంటుంది. రిలేషన్‌షిప్ మధ్య సఖ్యత లేకపోవడం కూడా అయి ఉండొచ్చు. అలాగనీ అన్ని సందర్భాల్లోనూ పర్సనల్ స్పేస్‌ను తప్పుగా అర్థం చేసుకోలేం. ఒక విధంగా చెప్పాలంటే అనేక అంశాలకు మార్గంగానూ వినియోగించుకోవచ్చు.
ప్రతీ విషయంలో ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, అన్యోన్యంగా ఉన్నవారిలో.. ఎన్నడూ లేని ‘పర్సనల్ స్పేస్’ అనే మాట ఆటంకంగా అనిపిస్తుండవచ్చు. అయితే మీ భాగస్వామికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారనే భావన ఉన్నప్పుడు అది అనుమానాలకు తావియ్యదు. రిలేషన్‌షిప్‌లో కొంత స్వాతంత్ర్యం, స్వావలంబనను కొనసాగించడం ద్వారా ఒకరి విశ్వాసాన్ని పొందడం వల్ల కూడా వ్యక్తిగత సమయం లభిస్తుంది. మనుషులన్నాక అనేక ఆలోచనలు, ఆసక్తులు, అభిరుచులు ఉంటాయి. వాటిని స్వేచ్ఛగా నెరవేర్చుకోగలగడం సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే పర్సనల్ స్పేస్ కూడా ఇచ్చిపుచ్చుకుంటే బంధాలు బలపడతాయి.
అదొక్కటే ముఖ్యం కాదు
మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి లేనప్పుడు మీకు ఎంతో మద్దతుగా నిలిచిన వ్యక్తులు, కుటుంబం, స్నేహితులు మిస్ అవుతున్నారని, వారిని మీరు విస్మరిస్తున్నారని అనిపిస్తే మీకు వారితో మాట్లాడటానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి వ్యక్తిగతంగా సమయం అవసరం. మీకు అలాంటి అవకాశం మీ భాగస్వామి ఇవ్వకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక నిమిషం ఆలోచించండి. అభిప్రాయాలను, సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడం కోసం పర్సనల్ స్పేస్ అవసంర అనేది తెలుసుకోండి. ఇలా అర్థం చేసుకోవడం అనేది జంటల మధ్య అనుమానాలను దూరం చేస్తుంది. రిలేషన్ షిప్ లో సెక్స్ ఒక భాగం కానీ అదే మొత్తం రిలేషన్ షిప్ ను నిలబెట్టడదు. పర్సనల్ స్పేస్ కూడా అవసరం అనేది గుర్తించాలి.