Mental health : శరీరంలో ఏదో జరుగుతోందన్న ఆందోళన.. దేనికి సంకేతమో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-11-03 14:17:42.0  )
Mental health : శరీరంలో ఏదో జరుగుతోందన్న ఆందోళన.. దేనికి సంకేతమో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ‘బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్’ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. కానీ ఇటీవల అనేక మందిని ప్రభావితం చేస్తున్న రుగ్మతల్లో ఇది కూడా ఉంటోందని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తు్న్నారు. తమ శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులకే అతిగా ఆందోళన చెందడం, ఇతరులతో పోల్చుకొని బాధపడటం వంటివి ఈ రుగ్మత బారిన పడిన వారిలో కనిస్తుంటాయి. అయితే నిపుణుల ప్రకారం.. దీనికి గల కారణాలేమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం.

లక్షణాలు

తమ శరీరంలో ఏదో వెలితిగా ఉందని ఫీల్ అవడం, అద్దంలో చూసుకున్నప్పుడు తమను తామే ఇష్టపడకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం వంటివి కూడా బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ (Body Dysmorphic Disorder) లక్షణాలుగా ఉంటాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం, ఆయా విషయాల పట్ల అవగాహన రాహిత్యం వల్ల కూడా ఈ రుగ్మత బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే జన్యుపరమైన కారణావల్లే ఎక్కువగా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా అభద్రతా భావానికి గురికావడం, చివరికి శరీరంపై పుట్టు మచ్చ కనబడినా, అది నచ్చకపోయినా దాని గురించి బాధపడటం వంటి విషయాలు బాధఇతులను మానసికంగా కృంగదీస్తాయి. కాబట్టి లక్షణాలు గుర్తించగానే అలర్ట్ అవ్వడం బెటర్ అంటున్నారు నిపుణులు.

నివారణ, చికిత్స

డిస్మోర్ఫిక్ డిజార్డర్ అనేది ఎల్లప్పుడూ ఉండే రుగ్మత కూడా కాకపోవచ్చు. ఆందోలనలను డైవర్ట్ చేయగల పరిస్థితుల ప్రభావం వల్ల అది క్రమంగా తగ్గిపోతుంది. అందుకే దీని బారిన పడినవారు ఒంటరిగా ఉండకపోవడం, తమను ఉత్సాహ పరిచే వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా గడపడం, ప్రతికూల ఆలోచనలను డైవర్ట్ చేసే యాక్టివిటీస్‌లో నిమగ్నం కావడం వంటివి చేయాలంటున్నారు నిపుణులు. యోగా మెడిటేషన్, రోజు వ్యారి వ్యాయామాలు, సామాజిక పరస్పర చర్యలు కూడా డిస్మోర్ఫిక్ డిజార్డర్‌ను దూరం చేసే ర్యల్లో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక చికిత్స విషయానికి కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులను మానసిక నిపుణులు సూచిస్తారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed