- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షణాలకు ముందే డయాబెటిస్‌ను గుర్తించే 'బయోమార్కర్'
దిశ, ఫీచర్స్ : వృద్ధుల్లో 'టైప్ 2' మధుమేహం సర్వసాధారణమే అయినా ఈ రోజుల్లో ఊబకాయంతో బాధపడే చాలామంది పిల్లల్లోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా కొందరు ప్రీడయాబెటిస్ బారిన పడుతున్నారు కూడా. నిజానికి ప్రీ-డయాబెటిస్ రోగులందరిలోనూ 'టైప్ 2' డయాబెటిస్ అభివృద్ధి చెందదు కానీ వీరిలో 50 శాతం మంది మాత్రమే పదేళ్ల ఫాలో-అప్‌లో మధుమేహానికి గురవుతారు. ప్రస్తుతం ఈ విషయాన్ని నిర్ధారించేందుకు బ్లడ్-గ్లూకోజ్ ట్రాకింగ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి లక్షణాలు కనిపించకముందే పర్టిక్యులర్ బ్లడ్ బయోమార్కర్ ద్వారా ముందే ఐడింటిఫై చేస్తే పూర్తిగా నివారించవచ్చని కొత్త అధ్యయనం సూచిస్తోంది.
వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధిచెందే క్రమంలో ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలు ఎక్కువగా దెబ్బతింటాయి. వ్యాధిని స్పష్టంగా గుర్తించగలిగే సమయానికే రోగులు అత్యంత కీలకమైన ఈ కణాలను సగం వరకు కోల్పోతారు. పైగా కాలేయం, పాంక్రియాస్‌లోని ప్రభావిత కణాల స్థితిని పరిమాణాత్మకంగా అంచనా వేయడం అసాధ్యమనేది నిపుణుల మాట. అందుకే పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఈ మేరకు రక్తంలో బీటా కణాల క్రియాత్మక ద్రవ్యరాశితో సంబంధమున్న ఒక అణువును గుర్తించారు. ఇది మధుమేహానికి ముందు దశలో ఏవైనా లక్షణాలు కనిపించడానికే ముందే ఆ పర్టిక్యులర్ అణువులో వచ్చే మార్పును పరోక్షంగా కనుగొంటుంది.
కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని గమనించడానికి బదులుగా ప్యాంక్రియాటిక్ బీటా కణాల క్షీణతను సూచించే బయోమార్కర్‌ను పరిశోధకులు కనుగొన్నారు. ఈమేరకు మధుమేహానికి సంబంధించిన వివిధ రకాలైన మౌస్ నమూనాల్లోని వేలాది విభిన్న మాలిక్యులర్ బయోమార్కర్లను స్కాన్ చేయడం ద్వారా పరిశోధకులు 1,5- అన్‌హైడ్రోగ్లుసిటోల్‌గా పిలువబడే నిర్దిష్ట చక్కెరను కనుగొన్నారు. కాగా ప్యాంక్రియాటిక్ బీటా కణాల్లో లోటుతో 1,5-అన్‌హైడ్రోగ్లుసిటోల్ తక్కువ స్థాయికి సంబంధం కలిగి ఉంటుందని అనేక విభిన్న విశ్లేషణల్లో అధ్యయనం నిరూపించింది. ఈ ప్రాథమిక ఫలితాలు కచ్చితంగా ఆశాజనకంగా ఉన్నా, దీన్ని వివిధ దశల్లో ఉన్న మధుమేహ రోగులపై పెద్దస్థాయిలో పరీక్షించాల్సి ఉందని, వారి 1,5-అన్‌హైడ్రోగ్లుసిటోల్‌ను అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు వెల్లడించారు.
ఈ బయోమార్కర్ డయాబెటిస్ ప్రమాదాన్ని కొలిచే ఒక-ఆఫ్ టెస్ట్ అవుతుందా లేదా కాలక్రమేణా వ్యక్తిగత స్థాయిల్లో మార్పులను ట్రాక్ చేయడం ద్వారా ప్రమాదంలో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి మాత్రమే సహాయపడుతుందా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.