మహిళలు నగ్నంగా పబ్లిక్‌గా ఈతకొట్టొచ్చు.. ప్రభుత్వం కీలక ఆదేశం

by sudharani |   ( Updated:2023-03-22 15:58:19.0  )
మహిళలు నగ్నంగా పబ్లిక్‌గా ఈతకొట్టొచ్చు.. ప్రభుత్వం కీలక ఆదేశం
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని పబ్లిక్ పూల్స్‌ను బెర్లినర్ బేడర్‌బెట్రీబ్ నిర్వహిస్తుంటుంది. ఇందుకు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేస్తూ ఫాలో కావాలని సూచిస్తుంటుంది. ఈ క్రమంలో అమ్మాయిలు స్విమ్ చేసేందుకు వెళ్తే కచ్చితంగా పైశరీరాన్ని(మొండెం) కవర్ చేయాల్సిందే. లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారు, ఒక్కోసారి శాశ్వతంగా బ్యాన్ చేస్తారు. అయితే ఇలాంటి రూల్స్ పురుషులకు మాత్రం వర్తించకపోవడంపై ఓ మహిళ.. సెనేట్ అంబుడ్స్‌పర్సన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఇది కచ్చితంగా లింగ వివక్ష కిందకు వస్తుందని ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న స్టేట్ గవర్నమెంట్.. మహిళలు టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సూచించింది. మగవారితో సమాన హక్కును కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఇక ఈ కేసులో అంబుడ్స్‌పర్సన్ ప్రమేయానికి ప్రతిస్పందనగా.. బెర్లినర్ బేడర్‌బెట్రీబ్ కూడా స్విమ్ సూట్స్‌కు సంబంధించిన నిబంధనలను మార్చాలని నిర్ణయించుకుంది. ఆడ, మగ, నాన్-బైనరీ అనే తేడా లేకుండా బెర్లిన్‌కు చెందిన అందరికీ సమాన హక్కులను అందిస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఈత దుస్తుల్లో నియంత్రణ ఏమీ లేదని, బహిష్కరణలు లేదా నిషేధాలు జారీ చేయబడవని స్పష్టం చేసింది.

ఇక ఈ నిర్ణయం జర్మనీకి నగ్నత్వం పట్ల ఉన్న మక్కువను మరోసారి తెలియజేస్తుందంటున్నారు విశ్లేషకులు. 19వ శతాబ్దపు చివరిలో జెర్మన్ నేచరిస్ట్ సోషల్ మూమెంట్, హెల్త్ కల్చర్.. న్యూడిటీ గురించి చర్చించింది. ఈ భావన కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇక 1920లో జర్మనీ తన మొదటి న్యూడ్ బీచ్‌ను సిల్ట్ ద్వీపంలో ఏర్పాటు చేసింది.

Read more:

ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు

కిడ్నీ విప్పిన గుట్టు.. చెల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్న సొంత అన్న

Advertisement

Next Story

Most Viewed