మహిళలు బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే!

by samatah |
మహిళలు బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ ఆచార సాంప్రదాయాల్లో బొట్టు పెట్టుకోవడం అనేది ఒకటి. ఆడపిల్లలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని చెబుతుంటారు పెద్దవారు. ముఖ్యంగా మన అమ్మమ్మలు, నానమ్మలు తప్పనిసరిగా పెద్ద సైజ్‌లో బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అయితే బొట్టు పెట్టుకోవడం వెనుక పురాణాలు ఏం చెబుతున్నప్పటికీ, ఆరోగ్యపరంగ మాత్రం చాలా లాభాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

యోగా ప్రకారం.. ఆజ్ఞ చక్రం అని మనం బొట్టు పెట్టుకునే ప్రదేశం ని అంటారు.మనిషి శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి వీటిని అన్నిటికీ కేంద్ర స్థానం ఆజ్ఞ చక్రం. కనుబొమ్మల మధ్య ఇది ఉంటుంది. దీంతో మనం బొట్టు పెట్టుకునే సమయంలో ఆ స్థానంలో ప్రెస్ చేయడం వలన అక్కడ ఉండే కళ్లు, మెదడు, పిట్యూటరికి సంబందించిన నాడులు ఉత్తేజమవుతాయి. దీని వలన వినికిడి శక్తి మెరుగు పడటం, మైగ్రెన్ నుంచి ఉపశమనం కలుగుతుందంట. అంతే కాకుండా డిప్రెషన్ కూడా తగ్గుతుందంట.అందువలన తప్పని సరిగా బొట్టు పెట్టుకోవాలి అంటున్నారు.

Advertisement

Next Story