ఎండా కాలంలో తాటి ముంజలు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా? షుగర్ పేషంట్లకు వరప్రసాదం..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-07 08:24:44.0  )
ఎండా కాలంలో తాటి ముంజలు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?    షుగర్ పేషంట్లకు వరప్రసాదం..
X

దిశ, ఫీచర్స్: సమ్మర్‌లో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్ తీసుకోవడం కామన్. కానీ హై న్యూట్రిషన్ వాల్యూ కలిగిన ఐస్ యాపిల్.. అవేనండి ‘తాటి ముంజలు’ తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ఎండాకాలంలో బాడీకి సరిపోయే విటమిన్స్, మినరల్స్‌ను పర్ఫెక్ట్‌గా అందించే ఈ పండు.. హై వాటర్ కంటెంట్, హై న్యూట్రిషనల్ వాల్యూతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. వేసవిలో మాత్రమే లభించే ఈ రేర్ ఫ్రూట్.. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. వడదెబ్బ నుంచి సంరక్షిస్తుంది. అయితే ఈ పండులో ఎలాంటి లక్షణాలున్నాయి? ఏ వ్యాధులకు చెక్ పెట్టగలదు? తెలుసుకుందాం.

న్యూట్రిషనల్ వాల్యూ(100g) :

ఎక్కువ మొత్తంలో నీరు కలిగిన తాటి ముంజలు.. విటమిన్ ఎ, బి, సితో పాటు జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం సమ్మర్‌లో వేడి తీవ్రత నుంచి కాపాడుతాయి.

ఎనర్జీ 87 kcal

ఫ్యాట్స్ 1.0 g

ప్రొటీన్స్ 2.8 g

కార్బోహైడ్రేట్స్ 18.5 g

ఫైబర్ 15 g

షుగర్స్ 14 -16


ప్రాపర్టీస్:

తాటి ముంజల్లో ఉండే వివిధ రకాల ఫైటోన్యూట్రియెంట్లు మానవ ఆరోగ్యానికి మేలు చేసే బయోలాజికల్ ప్రాపర్టీస్‌ను కలిగి ఉన్నాయి. బిజీ షెడ్యూల్స్‌లో బెటర్ స్లీప్ అందించి పీస్‌ఫుల్‌గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తున్నాయి. ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారించే ముంజలు.. గాయాలు తొందరగా మానేందుకు హెల్ప్ అవుతాయి కూడా.

* యాంటీ ఆక్సిడెంట్

* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ

* యాంటీ బాక్టీరియల్

* గాయాలు మానడంలో కీలకం

* మంచి నిద్ర

* ఆకలి పెరుగుదల

* మలబద్ధకం నుంచి ఉపశమనం

* మూత్రవిసర్జన సులభం

* వైరస్‌లతో పోరాటం

* రోగనిరోధక ప్రతిస్పందనను అణిచివేయడంలో కీలకం


స్కిన్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ :

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన తాటి ముంజలు.. మంట నుంచి చర్మానికి ఉపశమనం అందిస్తాయి. వేడి కురుపులు, చెమటకాయ, దద్దుర్లు వంటి సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడుతాయి. శీతలీకరణ లక్షణాలను కలిగిన ఐస్ యాపిల్.. ఫేస్ ప్యాక్‌లోనూ ఉపయోగించవచ్చు. ఇందులోని తెల్లటి జెల్లీని ఎఫెక్టెడ్ ఏరియాస్‌లో సున్నితంగా పూయడం ద్వారా స్కిన్ హీల్ కావడంతోపాటు మెరిసిపోతుంది.


డయాబెటిక్ ఫ్రెండ్లీ :

విటమిన్స్, మినరల్స్ రిచ్ సోర్స్‌గా ఉన్న ఐస్ యాపిల్..డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. 2006లో Uluwaduge నిర్వహించిన జంతు అధ్యయనం.. తాటి ముంజల్లోని స్టెరాయిడ్ లాంటి భాగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావాన్ని చూపుతుందని నిరూపించింది. ఆ తర్వాత నిర్వహించిన తదుపరి అధ్యయనం ఎండిన ముంజల పండ్ల గుజ్జును యాంటీ-హైపర్‌గ్లైసెమిక్ (గ్లూకోజ్-తగ్గించే) ఏజెంట్‌గా ఉపయోగించవచ్చని నివేదించింది. డయాబెటిక్ రోగులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్ కూడా ఎండిన ఐస్ యాపిల్స్ తినడం వల్ల సీరం గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని సూచించింది.


కాలేయ వ్యాధులకు చెక్:

ఐస్ యాపిల్‌లో పొటాషియం పుష్కలంగా ఉన్నందునా.. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. లివర్ అబ్‌నార్మాలిటీస్‌తో బాధపడుతున్న రోగులు.. వేసవిలో ఈ పండును తీసుకున్నట్లయితే కాస్త త్వరగా క్యూర్ అవొచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి.


వెయిట్ లాస్ :

ఐస్ యాపిల్ తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ మరియు విటమిన్లు కలిగి ఉంటుంది. నెమ్మదిగా బరువు తగ్గాలనుకునేవారికి హెల్ప్ అవుతుంది. ఈ పండులో నీటి శాతం అధికంగా ఉన్నందునా.. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. తద్వారా సరైన వెయిట్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది.


కిడ్స్ డైట్ :

మల్టీ విటమిన్స్, కాల్షియం, పొటాషియం, ఇనుము, కార్బోహైడ్రేట్లు వంటి మినరల్స్‌ సమృద్ధిగా ఉండే తాటి ముంజలు.. శరీరానికి ఎలాంటి అలర్జీని కలిగించవు. సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు. కాబట్టి వీటిని పిల్లలకు ఆహారంగా అందించడం మూలంగా భారీ హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతారు.

Advertisement

Next Story

Most Viewed