- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శారీరక ద్రవ సంబంధం లేకుండా సెక్స్.. దానితో ఈజీగా భావప్రాప్తి..
దిశ, ఫీచర్స్ : సెక్సువల్ యాక్టివిటీస్‌కు సంబంధించి 'డ్రై హంపింగ్' పదం కొత్తగా ఉన్నప్పటికీ ఇది కూడా లైంగిక సంపర్కమే.కానీ శారీరక ద్రవ సంబంధం లేకుండా అనుభవించే ప్రక్రియ. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి తన జననాంగాలను ఫర్నిచర్‌పై రుద్దడం లేదా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు తమ జననాంగాలను దుస్తుల పైనుంచే రుద్దుకోవడం ద్వారా లైంగిక ఆనందాన్ని పొందుతారు. దీన్నే డ్రై హంపింగ్‌గా, సంబంధిత ప్రవర్తనలను ఔటర్ కోర్స్‌గా పిలుస్తారు. కాగా ఈ పద్ధతిలోనూ సులభంగా భావప్రాప్తి పొందవచ్చు.
ప్రయోజనాలు :
* ఇతర రకాల లైంగిక ప్రేరణల అనుభూతులను అనుకరించి భాగస్వాములకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. భావప్రాప్తిని సాధ్యం చేయడమే కాక సాన్నిహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది.
* కొన్ని మతాలు, సంస్కృతుల్లోని వ్యక్తులు జననేంద్రియ ఉద్దీపన లేదా అంగప్రవేశంతో కూడిన సెక్స్‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి వారు సెక్సువల్ ప్లెజర్, సాన్నిహిత్యాన్ని అనుభవించేందుకు ఔటర్ కోర్స్ అనుమతిస్తుంది.
* డ్రై హంపింగ్ వల్ల గర్భం, STIల ప్రమాదం ఉండదు.
* లైంగిక నిగ్రహానికి డ్రై హంపింగ్ వంటి హాని తగ్గింపు వ్యూహాలు మంచి ప్రత్యామ్నాయం కావచ్చు.
ప్రమాదాలు :
డ్రై హంపింగ్‌కు పరిమితమైన వ్యక్తులు ప్రేరణలో భాగంగా నిగ్రహం కోల్పోయి సంభోగానికి ఆకర్షితులు కావచ్చు. పలుచటి దుస్తులు ధరించిన సందర్భాల్లో ప్రమాదవశాత్తూ అంగప్రవేశం జరగడం లేదా శారీరక ద్రవ సంపర్కం సంభవించవచ్చు. అందుకే నిండైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే డ్రై హంపింగ్‌తో ప్రమాదం ఉండదు.
* పదే పదే రుద్దడం వలన జననేంద్రియాలు లేదా చుట్టుపక్కల చర్మం చికాకు కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి లేదా రాపిడి గాయాలు ఏర్పడవచ్చు.
* భాగస్వామి సమ్మతి లేకుండా డ్రై హంపింగ్ బాధాకరమే కాక మానసికంగా హానికరం కూడా. పార్ట్‌నర్ ఇష్టానికి వ్యతిరేకంగా డ్రై హంప్ చేయడం ఆమోదయోగ్యం కాదు.
* దీనితో గర్భం, STIల ప్రమాదం లేనప్పటికీ కొన్ని సంస్కృతులు ఇప్పటికీ ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాయి. కఠినమైన నిగ్రహానికి కట్టుబడాలని బోధించే మతాలు, నైతిక నియమాలు.. వివాహం లేదా ఏకస్వామ్య సంబంధాలు వంటి కట్టుబాట్లను దాటి కోరుకునే ఏ ఆనందాన్నైనా ఖండించవచ్చు.