- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BELLY FAT: బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ప్రత్యేకంగా జిమ్ అక్కర్లేదు.. ఇంట్లో రోజూ ఈ పనులు చేస్తే చాలు
దిశ, ఫీచర్స్ : ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ టేస్టీగా ఉన్నాయని లాగిస్తుండటంతో బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. చిన్న వయసులోనే గుండె పోటు, స్ట్రోక్, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదానికి కారణం అవుతుంది. కాబట్టి జిమ్ అంటూ పరుగెడుతున్నారు జనాలు. కానీ దీనికి బదులు ఇంట్లోనే ఇలాంటి పనులు చేయడం వల్ల మంచి ఎక్సర్ సైజ్ అవుతుందని, పేరుకుపోయిన కొవ్వు ఆటోమాటిక్ గా తగ్గిపోతుందని సూచిస్తున్నారు నిపుణులు.
తోటపని
బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు సంతోషకరమైన, సులభమైన మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లాంట్స్ పేరెంట్‌గా మారిపోండి అంటున్నారు నిపుణులు. మీకు ఇష్టమైన మొక్కలను పెంచడం ద్వారా గార్డెనింగ్‌తో మీ అభిరుచిని కొనసాగించడంతోపాటు.. బెస్ట్ ఎక్సర్ సైజ్ చేసినట్లు అవుతుంది. తోటపనిలో భాగంగా తవ్వడం, కిందకి వంగి మట్టి ఎత్తడం, కలుపు తీయడం, నీరు పెట్టడం లాంటి పనులు రోజు చేయాల్సి వస్తుంది. దీనివల్ల కాళ్లు, పిరుదులు, చేతులు, భుజాలు, వీపు, పొత్తికడుపులోని ప్రధాన కండరాలపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఏళ్లుగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడం మాత్రమే కాదు పటిష్టమైన కండరాల నిర్మాణానికి దారితీస్తుంది.
మాపింగ్
మీ ఇంటిని ఎలాగూ శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటారు. కాబట్టి పని మనిషికి చెప్పే బదులు మీరే స్వయంగా చేసుకోండి. అటు డబ్బు ఆదా కావడంతోపాటు ఇటు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మోపింగ్ బెస్ట్ వ్యాయామం అని.. ఈ పని చేస్తున్నప్పుడు, మీరు మీ కోర్ కండరాలను నిమగ్నం చేస్తారని చెప్తున్నారు. అంతేకాదు భుజాలు, ట్రైసెప్స్, కండరపుష్టికి బాగా పని చేస్తుంది. ఈ వర్క్ నుంచి అధిక ప్రయోజనం పొందడానికి మీ హ్యాండ్ పొజిషన్ మార్చడం మంచిది.
బాత్రూమ్ క్లీనింగ్
బాత్రూమ్‌ను శుభ్రపరచడం అనేది గోడలను స్క్రబ్బింగ్ చేయడం, నేలను తుడుచుకోవడం, బేసిన్‌ను శుభ్రపరచడం, కమోడ్‌లను క్లీన్ చేయడంలో భాగంగా ఉంటుంది. ఈ పనుల్లో మీ కోర్ కండరాలను వినియోగిస్తారు. షవర్ నుంచి టాయిలెట్ వరకు అన్ని చోట్లా మొండిగా ఉండే ధూళిని తొలిగించే క్రమంలో మీరు డిఫరెంట్ మజిల్ గ్రూప్స్ ఎంగేజ్ చేస్తారు. దీనివల్ల ఎక్స్ ట్రా ఫ్యాట్ బర్న్ అవుతుంది.
తలుపులు, కిటికీలను శుభ్రపరచడం
లాన్సెట్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణం ప్రమాదాన్ని ఎలా తగ్గించగలదో చూపించింది. మీరు ఇప్పటికే మాపింగ్, బాత్రూమ్ క్లీనింగ్‌ను ఫాలో అవుతున్నట్లయితే.. తలుపులు, కిటికీలను కూడా క్లీన్ చేయవచ్చు. ఈ తేలికపాటి వ్యాయామం చురుకుగా ఉంచడంలో చాలా దోహదపడుతుంది. బెల్లీ ఫ్యాట్ ను టార్గెట్ చేస్తూ పని చేస్తుంది.
బట్టలు ఉతకడం
బట్టలు ఉతకడం అంటే సర్ఫ్ లో నానబెట్టడం, సోప్ అప్లయ్ చేయడం, తర్వాత శుభ్రంగా నీళ్లలో తీసి ఆరేయడం.. ఇలా అనేక దశలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో వంగడం, నిల్చోవడం, చుట్టూ తిరగం చేస్తుండటంతో కొవ్వు తగ్గే అవకాశం ఉంది. తరుచుగా చేస్తున్నట్లయితే ఫలితం త్వరగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.
Note : ఈ కంటెంట్ ఇంటర్నెట్ లో నుంచి తీసుకోబడింది. ఏదైనా వర్క్ అవుట్ చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.