- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెగ్గింగ్ 2.0 : కాలం మారింది.. వీధిలో కాదు ఆన్‌లైన్‌లో అడుక్కుంటున్నారు
దిశ, ఫీచర్స్: సాధారణంగా భిక్షగాళ్లు ఇంటింటికి తిరుగుతూ యాచించడం, వీధులు, సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం చూశాం. చిల్లర లేదంటే క్యూఆర్ కోడ్‌తో ముందుకొచ్చిన సంఘటనలు చూశాం. కానీ అంతకు మించిన అప్‌డేట్‌తో ముందుకొచ్చారు ఇండోనేషియన్ బెగ్గర్స్. ఏకంగా టిక్‌టాక్‌లో అడుక్కోవడం స్టార్ట్ చేశారు. వీధుల్లోకి వెళ్లడానికి బదులుగా వీడియో ద్వారా వర్చువల్ బహుమతులను కోరుతున్నారు. ఈ విధంగా వచ్చిన బహుమతులను టిక్‌టాక్‌లో క్యాష్‌గా మార్చే సౌకర్యం ఉండటంతో వీరి పని మరింత సులభమైపోగా.. రోజురోజుకు అడుక్కునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇండోనేషియాలో TikTok భిక్షాటన చాలా విస్తృతమైన దృగ్విషయంగా మారింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ దేశ సోషల్ మినిస్టర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో యాచించడం నిరోధించే ప్రయత్నాలను పెంచేశాడు. అటు ముస్లిం సమూహాలు కూడా అడుక్కోవడం పాపమని, బెగ్గింగ్‌ను ఆపే ప్రయత్నం చేసినా ఫలితాలు కనిపించలేదు. దీంతో మానవ గౌరవాన్ని కించపరిచినందుకు గాను అలాంటి వారు ఇస్లాం నుంచి నిషేధించబడ్డారు.
కాగా TikTok గిఫ్ట్-ఆఫరింగ్ ఫీచర్స్ ద్వారా ఆకర్షించబడుతున్న భిక్షగాళ్లు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే వెనక్కి తగ్గేలా కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. కనీసం 1000 మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న యాచకులను వారి అనుచరుల నుంచి వర్చువల్ గిఫ్ట్స్ స్వీకరించడానికి అనుమతిస్తుంది టిక్‌టాక్. ఆపై వాటిని నిజమైన డబ్బుగా మార్చవచ్చు. ఈ ఫీచర్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంది. కానీ టిక్‌టాక్‌కు ఉన్న జనాదరణ యాచకులకు మరింత హెల్ప్‌ఫుల్ అవుతుంది.
సాధారణంగా భిక్షగాళ్లు బాటసారుల నుంచి చిల్లర అడుగుతుంటారు. అయితే బెగ్గింగ్ 2.0 లో మాత్రం టిక్‌టాక్‌లో జాలి కలిగించే కొన్ని చర్యలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా వృద్ధ మహిళలు తమపై బురద నీరు పోసుకోవడం ద్వారా వీక్షకుల దాతృత్వాన్ని ఆకర్షిస్తున్నారు. బహుమతులు, డబ్బులు పొందగలుగుతున్నారు. అయితే ఈ మోడ్రన్ బెగ్గర్స్‌కు సంబంధించిన కంటెంట్‌పై విరుచుకుపడుతున్న ప్రభుత్వం.. ఇలాంటి వీడియోలను తొలగించమని టిక్‌టాక్‌ను కోరుతోంది. భిక్షగాళ్లకు నేరుగా బహుమతులు ఇవ్వడం ద్వారా మంచి చేస్తున్నామని జనం అనుకోవడం కరెక్ట్ కాదని, ఇలా విశ్వసిస్తున్నంత కాలం ఈ ధోరణి కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించింది. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదని ప్రజలకు పిలుపునిస్తోంది.