IAS OFFICER : హీరోయిన్‌ను మించిన అందంతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్.. చూసి తీరాల్సిందే..

by Sujitha Rachapalli |
IAS OFFICER : హీరోయిన్‌ను మించిన అందంతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్.. చూసి తీరాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయి నెట్టింట వైరల్ అయిపోయింది. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో SDM (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్న ఆమె.. 2022లో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఈ మధ్య తన సోదరి, న్యాయవాది పలక్‌తో కలిసి తిరుగుతుండగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ అంకిత్ కుమార్‌ కలిశారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. దీంతో నగరంలో ఓ ఐఏఎస్ అధికారి సామాన్యుడిలా తిరుగుతుండడం మాములుగా లేదంటూ వైరల్ అయిపోయింది వీడియో.

కాగా ఈ అందమైన IAS ఆఫీసర్ పరి బిష్ణోయ్ UPSC 2019 బ్యాచ్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 30 సాధించినట్లు తెలిపింది. ఓ ఛానల్ కథనం ప్రకారం UPSC క్రాక్ చేసేందుకు సన్యాసుల జీవనశైలిని అవలంబించింది. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ తొలగించడం నుంచి స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. మొత్తానికి తనను డిస్ట్రక్ట్ చేసే అన్నింటికీ దూరంగా ఉంది. సక్సెస్ అయింది. కాగా ఈ వీడియో వైరల్ అవుతుండగా.. బ్యూటీ విత్ బ్రెయిన్ అని పొగిడేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story