అందంగా కనిపించాలా.. ఈ టిప్స్ వారం రోజులు ట్రై చేయండి!

by Jakkula Samataha |
అందంగా కనిపించాలా.. ఈ టిప్స్ వారం రోజులు ట్రై చేయండి!
X

దిశ, ఫీచర్స్ : బ్యూటిఫుల్‌గా కనిపించడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా రెడీ అవుతే చూడటానికి చాలా బాగుంటారు. ఇక వారు కలర్‌పుల్‌గా కనిపించడానికి ఎన్నో టిప్స్ పాటిస్తుంటారు. క్రీమ్స్, లోషన్స్ వంటి వాటిని వాడుతూ తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకుంటారు. అయితే బయట దొరికే ప్రొడక్ట్స్‌తో కాకుండా మన ఇంట్లో ఉండే శనగపిండితో ముఖాన్ని నిగారింపుగా తయారు చేసుకోవచ్చు.

బ్యూటీ పార్లర్‌కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా, మన ఇంట్లోనే టమాటో రసం, శనగపిండితో ప్యాక్ రెడీ చేసుకుని వారం రోజులు కంటిన్యూగా పెడితే, నిగ నిగ లాడే ముఖం మీ సొంతం అవుతుంది. అది ఎలా అంటే?..ఒక కప్పు శనగపిండిలో, టమాటో రసం వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ఫేస్‌కు అప్లై చేసుకొని 10 నిమిషాల పాటు ఉండనివ్వాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే ఒక వారం రోజుల పాటు ఇలా చేయడం వలన, ముఖంపై ఉన్న ముడతలు, ఇతర యాంటీ ఏజింగ్ సమస్యలన్నీ మాయం అవుతాయి. ముఖం నిగారింపు గా తయారవుతుంది. అలాగే ఇంకొంత మంది ట్యాన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు, ఆరెంజ్ జ్యూస్‌‌లో శనగపిండి వేసి, మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని ముఖంపై 30 నిమిషాలపాటు ఉండనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ట్యాన్ సమస్యలు తొలగిపోయి, ఫేస్ అందంగా తయారు అవుతుంది.

Advertisement

Next Story